థాయ్‌లాండ్‌లో లాంచ్‌ అయిన Vivo Y30 5G స్మార్ట్‌ ఫోన్.. స్పెసిఫికేషన్స్‌ ఇవే..!

-

వివో నుంచి కొత్త ఫోన్‌ విడుదలైంది.. అదే Vivo Y30 5G. Yసిరీస్‌లో భాగంగా కంపెనీ ఈ ఫోన్‌ను విడులద చేసింది. బడ్జెట్‌లో 5G స్మార్ట్‌ఫోన్‌ అంటే పెద్ద విషయమే.! ఈ మధ్యే ఇండియన్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయిన Vivo T1 స్మార్ట్‌ఫోన్‌ను పోలి ఉంది. ఈ ఫోన్‌ విశేషాలు ఇలా ఉన్నాయి..

Vivo Y30 ధర..

ప్రస్తుతం థాయ్ లాండ్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అక్కడ ఈ ఫోన్‌ ధర THB 8,699. అంటే మన కరెన్సీలో సుమారు రూ.18,950/-ఈ ఫోన్ త్వరలోనే ఇండియాలో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అంటున్నారు.
Vivo Y30 స్పెసిఫికేషన్లు..
Y30 5G మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoCని ప్యాక్ చేస్తుంది.
చిప్‌సెట్ 6GB RAMతో వస్తుండగా, అదనంగా 2GB ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌కు సపోర్ట్ చేస్తుంది.
స్టోరేజ్ విస్తరణ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్‌తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ స్టార్‌లైట్ బ్లాక్, రెయిన్‌బో అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.51 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే అందించారు.
6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఫోన్‌ నడుస్తుంది.
వెనకవైపు 50MP+2MP కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌ అందించారు.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్‌ సపోర్ట్‌ ఇచ్చారు.
Vivo Y30 5Gలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్ సపోర్ట్‌, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్-సిమ్, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.1, ఉన్నాయి.
వీవో నుంచి రీసెంట్‌గా నాలుగు ఫోన్లు రిలీజ్‌ అయ్యాయి. ఈ ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ అయితే ఈ రెంజ్‌ ధరలో ఉండే ఫోన్లకు పోటీ ఇస్తుందనే టెక్కీస్ అభిప్రాయం.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news