Vivo Yo1 బడ్జెట్ స్మార్ట ఫోన్.. ఫీచర్స్ అన్నీ ఓకే.. కానీ అది లేదు..!

-

వివో నుంచి వరుసగా ఏదో ఒక సిరీస్ లో ఫోన్లు లాంఛ్ అవుతునే ఉన్నాయి. తాజాగా వీవో ఇప్పుడు తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే Vivo Yo1. పది వేలలోపే మంచి ఫీచర్సను అందించారు. ఫోన్ స్పెసిఫికేషన్స్, బ్యాటరీ సామర్థ్యం, ధర ఎంతుందే మీరే చూడండి.

వివో వై01 ధర..

ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్+ 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు.
ఎలిగెంట్ బ్లాక్, సఫైర్ బ్లూ రంగుల్లో వివో వై01 కొనుగోలు చేయవచ్చు.
దీన్ని పూర్తిగా మనదేశంలోనే రూపొందించినట్లు వివో తెలిపింది.

వివో వై01 స్పెసిఫికేషన్లు..

6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
స్క్రీన్ రిజల్యూషన్ 720 × 1600 పిక్సెల్స్‌గా ఉంది.
యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ ఉంది.
మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కూడా ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, బైదు, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు.

కెమేరా క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యం..

ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం.. ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు.
వివో వై01 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
10W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ మొబైల్ పనిచేయనుంది.
అయితే..దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. ఫేస్ రికగ్నిషన్ మాత్రం అందించారు. ఈ మధ్య అన్ని ఫోన్లకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అందరూ బాగా అలవాటుపడిపోయారు కూడా.. కానీ ఈ ఫోన్ కు లేకపోవడం కాస్త మైనస్సే.

Read more RELATED
Recommended to you

Latest news