Realme నుంచి Q5.. రూ. 16 వేలకే అదిరిపోయే ఫీచర్స్

-

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం.. రియల్‌మీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసింది. రియల్‌మీ క్యూ5 పేరుతో వచ్చిన ఈ ఫోన్ చైనాలో విడుదల అయింది.. భారత్ మార్కెట్ కు త్వరలోనే రానుంది.. మరి ఈ తరుణంలో.. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..

Realme క్యూ5 హైలెట్స్..

రియల్‌మీ క్యూ5 ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.6 ఇంచెస్‌ ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు.
క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ చేసే ఈ ఫోన్‌లో 60 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.
 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.
క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ చేసే ఈ ఫోన్‌లో 60 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.
కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

ధర..

ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి..

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.16,600,
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.18,900,
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.21,200 ఉండనుంది.
బడ్జెట్ లో మంచి ఫోన్ తీసుకువాలంటే.. రియల్‌మీ మంచి ఎంపికే.. కొందరు.. ఎన్నిసార్లు కొత్త ఫోన్ తీసుకున్నా.. వారి ఎంపిక.. ముందు వాడిన కంపెనీదే అయి ఉంటుంది. అందులోనే వర్షన్స్ మార్చి తీసుకుంటారు. రియల్‌మీకి కూడా అలంటి కష్టమర్స్ ఎక్కువగానే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news