రియ‌ల్‌మి 8, 8 ప్రొ స్మార్ట్ ఫోన్ల విడుద‌ల‌.. ఫీచ‌ర్లు అదిరాయ్‌..!!

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా రియ‌ల్‌మి 8, 8 ప్రొ పేరిట రెండు స్మార్ట్ ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. ఈ ఫోన్ల‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. రెండు ఫోన్ల‌లోనూ 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇక మిగిలిన ఫీచ‌ర్ల‌ను కూడా ఆక‌ట్టుకునేలా అందిస్తున్నారు.

realme 8 and realme 8 pro phones launched in india

రియ‌ల్‌మి 8 ఫీచ‌ర్లు

* 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెస‌ర్‌, 4/6/8 జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11
* 64, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి 8 ప్రొ ఫీచ‌ర్లు

* 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 720జి ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11
* 108, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ
* ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి 8 ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.15,999 గా ఉంది. 8జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.16,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తున్నారు.

రియ‌ల్‌మి 8 ప్రొకు చెందిన 6జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.17,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తున్నారు.

ఈ ఫోన్ల‌పై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల‌తో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.