అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన శాంసంగ్ గెలాక్సీ ఎ32 స్మార్ట్ ఫోన్

-

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్.. గెలాక్సీ ఎ32 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో బుధ‌వారం విడుద‌ల చేసింది. ఇందులో 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తున్నారు. మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్‌ను అమ‌ర్చారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఇందులో ల‌భిస్తుంది. 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా, 5 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, 20 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు.

Samsung Galaxy A32 smart phone launched

ఈ ఫోన్ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్ ల‌భిస్తుంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ32 ఫీచ‌ర్లు…

* 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11
* డ్యుయ‌ల్ సిమ్‌, 64, 8, 5, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 20 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎ32 స్మార్ట్ ఫోన్ ఆస‌మ్ బ్లాక్‌, ఆస‌మ్ వైట్‌, ఆస‌మ్ బ్లూ, ఆస‌మ్ వ‌యొలెట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ రూ.21,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.2వేల వ‌రకు క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు. నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news