ఇండియాలో మొదలైన Samsung Galaxy S23 సిరీస్‌ ప్రీ బుకింగ్స్..

-

శాంసంగ్‌ నుంచి త్వరలోనే కొత్త ఫోన్‌ లాంచ్‌ కాబోతుంది..Samsung Galaxy S23 సిరీస్‌లో.. మొత్తం మూడు మోడల్స్‌లో ఫోన్‌ విడుదల కానుంది. లాంచ్‌ డేట్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. అవే.. Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra. ఈ మూడు ఫోన్లు గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్ కానున్నాయి. Galaxy Unpacked 2023 ఈవెంట్ ఫిబ్రవరి 1న జరగనుంది. ఆ తేదీకి ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది. అయితే ఈలోపే శాంసంగ్ సంస్థ Samsung Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్‌ స్టాట్‌ చేసింది..భారత్‌లో ఆసక్తిగల కొనుగోలుదారులు ముందుగానే ఈ ఫోన్లను బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ చేసుకునే కస్టమర్లకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.. మరి ఆ ప్రీ-బుకింగ్ బెనిఫిట్స్ ఏంటంటే..

Samsung Galaxy S23 ప్రీ-బుకింగ్స్ ఆఫర్స్

Samsung Galaxy S23 సిరీస్ ఫోన్లను ఆసక్తిగల వారు శాంసంగ్ ఇండియా అధికార వెబ్ సైట్ ద్వారా ప్రీ-బుక్ చేసుకోవచ్చు. దీంతో ఫోన్స్ అఫీషియల్‌గా సేల్‌కి వచ్చిన తర్వాత ప్రీ-బుకింగ్ కస్టమర్స్‌కి వెనువెంటనే డెలివరీ అవుతాయి. ప్రీ-బుక్ చేసుకునే వారికి శాంసంగ్ సంస్థ రూ.5,000 విలువచేసే వోచర్స్‌ని అందిస్తోంది. Samsung Galaxy S23 సిరీస్ ఫోన్‌ని ముందస్తుగా బుక్ చేసుకోవాలంటే టోకెన్ అమౌంట్ రూ.2,000 చెల్లించాలి. తర్వాత మీరు ఫోన్‌ని కొనాలనుకుంటే అందులో నుంచి ఈ మొత్తం తగ్గించబడుతుంది. ముందస్తుగా ఫోన్ ని బుక్ చేసుకునే వారికి స్పెషల్ కలర్ ఆప్షన్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.. ఈ ప్రత్యేకమైన రంగు ఎంపికలు కేవలం శాంసంగ్ వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

అంతేకాదు.. శాంసంగ్ సంస్థ బోలెడన్ని లాంచ్ ఆఫర్లను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ ఆఫర్లు ప్రీ-బుక్ చేసుకున్న కస్టమర్లకు కూడా వర్తిస్తాయి. అంటే ప్రీ-బుకింగ్ ఆఫర్లతో పాటు, అదనంగా సేల్ ఆఫర్స్ కూడా పొందవచ్చు..

Samsung Galaxy S23 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy S23 Ultra స్మార్ట్‌ఫోన్ 6.8-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది.
ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ వాడినట్లు సమాచారం.
16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ వస్తోంది.
ఈ డివైజ్ 200 మెగాపిక్సెల్ భారీ కెమెరా సెన్సర్ తో వస్తోంది. దీనికి తోడు 10ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి.
పవర్ బ్యాకప్ కోసం Samsung Galaxy S23 Ultra లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ఇది 25 వాట్/45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0/5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news