టాటా నుంచి సూపర్ ఫీచర్లతో సూపర్ SUV.. లాంచ్ ఎప్పుడంటే..?

-

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎస్‌యూవీ వేరియంట్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీలు చాలా ఎస్‌యూవీలను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు టాటా మోటార్స్ కూడా అధికారికంగా కర్వ్ ఎస్‌యూవీని పరిచయం చేసింది.ఇది డీ-సెగ్మెంట్ ఎస్‌యూవీ మార్కెట్లో తన సత్తా చాటేందుకు ఇండియన్ మార్కెట్లోకి వస్తోంది. ఈ డీ-సెగ్మెంట్లో ఇప్పటికే పాపులర్ అయిన హ్యూందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడళ్లతో ఈ టాటా కర్వ్ కార్ డైరెక్ట్ గా పోటీపడనుంది.

ఈ కర్వ్ డిజైన్ విషయానికి వస్తే టాటా ఎస్‌యూవీ మోడళ్ల లాగానే ఉంటుంది. దీనికి బంపర్స్, హెడ్ ల్యాంప్స్, టాటా సిగ్నేచర్ ఎల్ఈడీ ఐబ్రో లైటింగ్ వంటివి ఉంటాయి. అలాగే సైడ్ డోర్లు యూనిక్ పాప్ అవుట్ డోర్ హ్యాండిళ్లను కలిగి ఉంటాయి. పెటల్ షేప్ లో అల్లాయ్ వీల్స్ ఉంటాయి. 2024 భారత్ మొబలిటీ ఎక్స్ పో లో ప్రదర్శించినట్లుగానే ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.అయితే ఈ కారు ఇంటీరియర్ గురించి ఇంకా పూర్తి స్థాయిలో రివీల్ కాలేదు. అయితే నెక్సాన్, హ్యారియర్ వేరియంట్ల లాగానే ఈ కార్ ఉండే అవకాశం ఉంది. అలాగే అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్(అడాస్) ఫీచర్ లెవెల్-2 కేపబులిటీతో ఈ కార్ ఉంటుంది. 360 డిగ్రీల కెమెరా పార్కింగ్ ను ఈజీ చేస్తుంది. పానరోమిక్ సన్ రూఫ్, వెటిలేటెడ్ సీట్లు మంచి సౌకర్యాన్ని అందిస్తాయి.

దీనికి పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉంటుంది. డిజిటల్ డిస్ ప్లే కూడా ఉంటుంది.ఇక ఈ కర్వ్ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటిది 1.2 లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ యూనిట్. ఇది 123 బీహెచ్పీ 225ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. సిక్స్-స్పీడ్ మాన్యువల్ ఇంకా సెవెన్-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్(డీసీటీ) ఉంటుంది. ఇంకా అలాగే డీజిల్ వేరియంట్ వచ్చేసరికి 1.5 లీటర్ ఇంజిన్, 113 బీహెచ్పీ, 260ఎన్ఎం టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఇందులో సిక్స్- స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఉంటుంది.ఈ కారు ధర విషయానికి వస్తే దీని ధర గురించి ఆగస్టు ఏడో తేదీన కంపెనీ ప్రకటించనుంది. అలాగే ఆ రోజు కర్వ్ ఈవీ వెర్షన్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఆ లాంచ్ సందర్భంగా ఈ కారు ధరను కూడా ప్రకటించనున్నట్లు టాటా కంపెనీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version