త్వరలో వాట్సాప్ లో 2జీబీ ఫైల్ ని కూడా సెండ్ చెయ్యచ్చట..!

-

ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరూ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ను ఉపయోగిస్తే సులభంగా మనం ఇతరులకు మెసేజ్ లు పంపుకోవచ్చు. అదే విధంగా వీడియోలని ఫోటోలని కూడా ఈజీగా షేర్ చేసుకోవడానికి అవుతుంది. అయితే మీడియా ఫైల్స్ షేరింగ్ పై వాట్సాప్ పరిమితులు విధించింది. 100 ఎంబి కన్నా ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్ ని వాట్సప్ ద్వారా షేర్ చేయకూడదు.

వాటిని షేర్ చేద్దామని ప్రయత్నించినా అవి సెండ్ అవ్వవు. అయితే ఈ ఫైల్స్ ని షేర్ చేయలేకపోతున్నామని చాలా మంది యూజర్లు వాట్సాప్ దృష్టికి తీసుకువెళ్లారు. అందుకని వాట్సాప్ ఈ సమస్యను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో దీని కోసం కొత్త ఫీచర్ ని వాట్సాప్ తీసుకు రానుంది. మరి ఇక దాని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే..

వాట్సప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ డేటా ఇన్ఫో కొత్త ఫీచర్ ని తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ తో 2gb సైజు ఉన్న మీడియా ఫైల్స్ ని మనం ఇతరులకు షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని మీద పరీక్షిస్తున్నారు. ఈ ఫీచర్ ని త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో చూసుకున్నట్లయితే వాట్సాప్ లో కేవలం 16 జీబీ సైజు ఉన్న ఫైల్స్ ని మాత్రమే షేర్ చేయడానికి అయ్యేది.

తర్వాత దీనిని 100 ఎంబీ కి పెంచారు అయితే ఈ మధ్య కాలంలో ఫోటోలు లేదా వీడియోలు మంచి క్వాలిటీతో ఉంటున్నాయి. ఈ మూలంగానే ఫైల్ సైజు ఎక్కువగా ఉంటోంది. ఈ కారణంగానే వాట్సాప్ ద్వారా ఫైల్స్ ని షేర్ చేయలేక పోతున్నాము. ఇప్పుడు వాట్సాప్ ఫైల్ సైజ్ లిమిట్ ని పెంచితే ఈజీగా మనం షేర్ చేసుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news