నువ్వెలా ఉంటే ప్రపంచం నిన్నలా చూస్తుందని చెప్పే అద్భుతమైన కథ..

-

ఒక ఊరికి కొత్తగా వస్తున్న ఒక వ్యక్తి ఆ ఊరిలో పెద్ద మనిషిగా చెప్పుకునే వ్యక్తి వద్దకు వచ్చాడు. పొరుగూరి నుండి వచ్చి ఇదే ఊరిలో ఉండిపోదామనుకున్న అతను, ఆ ఊరిలో ప్రజలు ఎలాంటి వారో తెలుసుకుందామని పెద్ద మనిషిని అడిగాడు. ఇక్కడ ఊరివాళ్ళు అందరూ మంచివాళ్ళేనా అని. దానికి ఆ పెద్ద్దమనిషి, నువ్వు ఏ ఊరి నుమ్డి వస్తున్నావు? అక్కడ ఊర్లో వాళ్ళు ఎలాంటి వారు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఛీ వాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదు.

వాళ్ళంతా చెత్త వాళ్ళు. పిసినారులు. ఎవ్వరికీ సాయం చేయని వెధవలు అంటూ తిట్టాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, ఇక్కడ ఉన్న జనాలు కూడా అలాంటి వాళ్ళే అన్నాడు. మరుసటి రోజు మరో వ్యక్తి వచ్చాడు. ఈ ఊర్లో మనుషులు ఎలాంటి వాళ్ళని ప్రశ్నించాడు. పెద్ద మనిషి మళ్ళీ రివర్స్ లో ప్రశ్న వేసాడు. దానికి ఆ వ్యక్తి, ఆ ఊర్లోని జనం చాలా మంచివారు. అక్కడ వారు చాలా సాయపడతారు. దేనికైనా ముందుగా వస్తారు. ఇంట్లో పండగంటే అందరూ పనిచేస్తారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు అన్నాడు.

ఆ పెద్ద మనిషి, ఇక్కడ కూడా అలాంటి వాళ్లే ఉన్నారు అన్నాడు. అంటే, నీ జీవితంలో నువ్వ్వు అవతలి వారితో ఎలా ప్రవర్తిస్తావో, అవతలి వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ప్రపంచంలో మంచిని చూడని నీలో మంచిని ప్రపంచం చూడదు. నువ్వెలా చూస్తే ప్రపంచం అలాగే చూస్తుంది. అందుకే ఎప్పుడైనా పాజిటివ్ గా ఉండడం మంచిది. అవతలి వారిలో చెడులక్షణాలు వెతికి మరీ చూడాల్సిన పని లేదు. మంచి ఒక్కటి కనుక్కున్నా అంతే చాలు. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా.

Read more RELATED
Recommended to you

Latest news