గుప్పెడంతమనసు 270 ఎపిసోడ్: జగతి లేకుండా ఇంటర్వూకి రానన్న వసూ..నీకు నేనెక్కువా..మీ మేడమ్ ఎక్కువా అని వసూని అడిగిన రిషీ

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని రిషీకి ఫోన్ చేసి ఓవర్ యాక్షన్ చేస్తుంది. నా మనసేం బాలేదు రిషీ, అసలు బతకాలనే లేదు నాన్న అంటుంది. రిషీ ఏమైంది పెద్దమ్మా, ఎందుకిలా మాట్లాడుతున్నారు అంటాడు. ఆ జగతి నన్ను కాదు కాదు నిన్ను నానా మాటలు అనింది. తనేమంటుందో తెలుసా..ఈరోజు జరిగే ఛానల్ ఇంటర్వూలో తను అంతా చెప్పేస్తుందట. అంతా అంటే అని రిషీ అడిగితే..కాలేజ్ లో జరిగే ఛానల్ ఇంటర్వూలో నువ్వు తన కొడుకువని, మహేంద్ర తన భర్త అని చెప్పేస్తుందట. నన్ను ఎన్ని మాటలందో తెలుసా, ఎలా బెదిరిస్తుందో అంటూ నటిస్తుంది. తనని మీరెక్కడ కలిశారు అని రిషీ అడుగుతాడు. బయట కలిశాం అంటుంది దేవయాని. అయినా ఎందుకు కలిశారు అని రిషీ అడిగితే..దేవయానికి ఏం చెప్పాలో అర్థంకాదు..ఇంతలో రిషీయే ఏదో చెప్పి మిమ్మల్ని రప్పించి ఉంటుంది అంతేకదా అంటాడు. దేవయాని అంతే రిషీ అంతే అని ఎన్ని మాటలందో తెలుసా అని , ఆ మాట( మీడియా ముందు చెప్పుంది. ఏమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుందా చూస్తా అంటాడు ఈ రిషీ..దేవయాని ఇలాంటిది ఏదో చేస్తుందనో వీడియోరికార్డు చేయించాను నీకు పంపించాను చూడు అంటుంది. రిషీ ఆ వీడియో చూసి చిర్రెత్తిపోతాడు.

ఇంకోవైపు వసూ స్టేజ్ పై సర్దుతూ ఉంటుంది. మహేంద్ర, ఫణీంద్ర వచ్చి జగతి మేడమ్ ఇంకా రాలేదా అంటే.. దార్లో ఏదో పని ఉందని అది చూసుకుని వస్తా అన్నారు అంటుంది. అలా వాళ్లు ముగ్గురు ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటారు. ప్రోగ్రామ్ నీట్ గా చేయాలి, రిషీకి కోపంరాకుండా చూసుకోవాలి అని. మరోసీన్ లో రిషీ ఫుల్ ఫైర్లో క్యాబిన్లోకి వెళ్లి జగతిమేడమ్ ని పిలవండి అని చెప్తాడు. జగతి అప్పుడే వస్తుంది. సెక్యురిటీ ఎండీ సార్ రమ్మంటున్నారు అని చెప్తాడు. క్యాబిన్ లో రిషీ దేవయాని అన్న మాటలను తలుచుకుంటూనే ఉంటాడు. ఇంతలో జగతివస్తుంది. రండి మేడమ్ మీకోసమే ఎదురుచూస్తున్నాను, రండి కుర్చోంచి అంటాడు. మేడమ్ అసలు మీ మనసులో ఏముందు అంటాడు రిషీ. ఏ విషయం సార్ మీరు మాట్లాడుతుంది అంటుంది జగతి. రిషీ ఆ వీడియో చూపిస్తాడు. జగతికి ఫీజులు ఎగిరిపోతాయ్.

రిషీ ఏం చేద్దాం అనుకుంటున్నారు కాలేజ్ లో మా కుటుంబం పరువు తీద్దాం అని డిసైడ్ అయ్యారా అంటాడు రిషీ. జగతి మీ పెద్దమ్మగారు మొత్తం వీడియో పంపిస్తే బాగుండేది, వెనకా ముందు తీయకుండా, తనకు అనుకూలంగా ఉండేలా తీసి పంపించారు అంటుంది జగతి. అంటే మీరు అనలేదా అని రిషీ అడిగితే..అన్నాను..కావాలనే పిలిచి అలా అనిపించారు అని జగతి అంటుంది. ఇలా వీళ్లిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ వద్దు మేడమ్ ఈ వీడియో నిజమా అబద్ధామా అది చెప్పండి చాలు అంటాడు రిషీ. సార్ అది తప్పు దోవ పట్టిస్తూ అని జగతి నిజం చెప్పబోతుంది. కానీ రిషీ వినడు నిజమా అబద్ధమా అంటాడు. జగతి నిజంగా కనిపించే అబద్ధం అంటుంది జగతి. కళ్లతో చూసిన నిజాన్ని అబద్ధంగా నమ్మమంటారా అని రిషీ అడుగుతాడు. కొన్నిసార్లు కళ్లకి కనిపించేవి కూడా అబద్ధాలే అవుతాయ్ సార్ అంటూ నేనెప్పుడూ నా స్వార్థంకోసం ఆలోచించలేదు అంటుంది జగతి. అలాంటప్పుడు ఈరోజు జరిగే ఛానల్ ఇంటర్వూలో మీరు కనిపించకూడదు అంటాడు. జగతి లేచి వెళ్లిపోబోతుంది. రిషీ నేను చెప్పిన మాటను అంగీకరించినందుకు థ్యాంక్స్, ఇంకోక మాట కూడా మీకు చెప్పాలి అని మా డాడ్ కి ఈ విషయాలు చెప్పరని ఆసిస్తున్నాను అంటాడు. ఆల్ ది బెస్ట్ సార్ ఇంటర్వూకి అని జగతి వెళ్లిపోతుంది. రిషీ పెద్దమ్మా అనుకుని పెద్దమ్మకు కాల్ చేస్తాడు.

వసూ వచ్చి మేడమ్ ఇంకా రాలేదు అని మహేంద్రకు చెప్తుంది. మహేంద్ర కాల్ చేస్తాడు. జగతి ఫోన్ కట్ చేసి కారు ఎక్కుతుంది. మహేంద్ర మళ్లీ ఫోన్ చేస్తాడు.జగతి కాల్ కట్ చేసి వెళ్లిపోతుంది. అటెండర్ వచ్చి జగతి మేడమ్ వచ్చి వెళ్లిపోయారు సార్ అని చెప్తాడు. మహేంద్ర అదేంటి అనుకుని జగతిని కలవడానికి వెళ్తా అంటాడు. సర్ నేను వస్తాను అని వసూ అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

తరువాయిభాగంలో వసూ-మహేంద్ర కార్ దగ్గరకు వెళ్తుంటే రిషీ పిలుస్తాడు. డాడ్ ఏంటి ఎక్కడి వెళ్తున్నారు అంటే..జగతి కాలేజ్ కి నుంచి వెళ్లిపోయిందట ఏమైందో అని అంటారు. మీడియా వాళ్లు వచ్చారు మీరు రండి అంటాడు రిషీ. వసూ సారీ సార్ మేడమ్ లేకుండా నేను ఆ ఇంటర్వూకి రాను సార్ అని సీరియస్ గా చెప్తుంది. రిషీ నీకు నేను ఎక్కువా మీ మేడమ్ ఎక్కువా అంటాడు. సోమవారం చూద్దాం వసూ ఈ ప్రశ్నకు ఏం సమాధానం ఇస్తుందో.

– Triveni Buskarowthu