గుప్పెడంతమనసు ఎపిసోడ్ 325: పొగరెవరో తెలుసుకున్న మహేంద్ర..వసూ-గౌతమ్ లను చూసి తట్టుకోలేకపోతున్న రిషీ

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ కాలేజ్ కి వచ్చి వసూ, మహేంద్ర, జగతి వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. వసూ గురించి పొగుడుతూ ఉంటాడు గౌతమ్. వసుధార జగతి మేడమ్ శిష్యురాలు అంటాడు మహేంద్ర. గౌతమ్ జగతీతో… వసుధారతో తన పరిచయం ఎలా జరిగిందో చెప్తూ..కార్డ్స్ బ్యాగ్స్ లో ఉండిపోయాయ్..అందులో నంబర్ చూసి వసుధార కాల్ చేసిందని చెప్తాడు. వసూ కార్డ్స్ ఇవ్వబోతే..తీసుకుంటానులే వసుధార నేనెక్కడికి పోతాను అంటాడు. అటుగా వెళ్తున్న రిషీని పిలచి..ఇప్పుడే మీ జగతి మేడమ్ గారిని కలిశాను. మిషన్ ఎడ్యుకేషన్ ఐడియా తనదే అంటగా అంటాడు గౌతమ్. అయితే అంటాడు రిషీ. అయితే ఏంట్రా, నువ్వు రోజు ఆవిడకు థ్యాంక్స్ చెప్పినా తప్పులేదు అని జగతిని పొగుడుతుంటాడు. రిషీ మనకు మీటింగ్ ఉందికదా పద డాడ్ అంటాడు. జగతి వసూని పిలిస్తే..మేడమ్ మీరు వెళ్లండి కాసేపు బయటకుర్చోని వస్తాను అంటుంది. వెంటనే గౌతమ్ పదండి వసుధార నేను కంపెనీ ఇస్తాను అంటాడు. నువ్వు బయట తిరగకుండా వెళ్లి నా క్యాబిన్ లో కుర్చోమంటాడు రిషీ.

వసూ బయటకొచ్చి పుష్పతో మాట్లాడుతుంది. గౌతమ్ టాపిక్ వస్తుంది. వసూ గౌతమ్ గారు పదేళ్లక్రితం పరిచయం ఉన్నట్లు నవ్వుతూ మాట్లాడుతున్నారు..మన రిషీ సార్ ఉన్నారు..అసలు నోట్లోంచి మాటేరాదు..మాట మాట్లాడితే ముత్యాలు రాళ్తాయా అన్నట్లు మాట్లాడుతారు. అప్పుడే రిషీ వింటాడు. పుష్ప నీది కూడా కలుపుకోలుతనమే కదా..అన్నింటిలో దూసుకుపోతావ్ అంటుంది. అవును పుష్ప అలానే ఉండాలి..రిషీ సార్ ని చూడు…ఎప్పుడు కోపంగా ఉంటారు..అదే గౌతమ్ గారిని చూడు గలగలా మాట్లాడతారు..మనసులో ఏది ఉంటే అది చెప్పేస్తారు అని నువ్వు నోట్ బుక్ అడిగావ్ కదా ఇస్తాను అని నోట్ బుక్ ఓపెన్ చేస్తుంది. అందులోంచి నెమలిక గాలికి ఎగిరి…నేరుగా రిషీ షట్ లోకి ఇరుక్కుంటుంది. అది వసూ, పుష్పాలు చూస్తారు. పుష్ప భయంతో వెళ్లిపోతుంది.

రిషీ వచ్చి ఏంటి బానే మాట్లాడుతున్నావ్ అంటే.. ఏం లేదు సార్ మనషులు మాట్లాడేవిధానం గురించి పుష్పకు చెప్తున్నాను అంటుంది. ఆహా..మధ్యమధ్యలో నా పేరు వినపించింది అని రిషీ అంటే..మాటలు ఎలా పొదుపుగా మాట్లాడాలో మీ దగ్గర నేర్చుకోవాలి అని చెప్పాను అంటుంది వసూ. మరి గౌతమ్ పేరు వినిపించిందేంటి అంటే..గలగల ఎలా మాట్లాడాలో చెప్తూ గౌతమ్ పేరు వచ్చింది. నమ్మొచ్చు అంటా..అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పలేను కానీ..అంతే సార్ అంటుంది వసూ. రిషీ నెమలీక ఇచ్చే వసూ థ్యాంక్స్ చెప్తుంది. రిషీ థ్యాంక్స్ వద్దూ..సారీ చెప్పూ..నువ్వు మీ మేడమ్ మా పెద్దమ్మకు సారీ చెప్పాలి అంటాడు. వసూ నేను చేయని తప్పుకు నేను సారీ చెప్పను సార్ అంటుంది వసూ. పెద్దమ్మ హట్ అయ్యారు, ఆవిడ బాధపడ్డారు, నేను బాధపడ్డాను మీరు సారీ చెప్తే..ఇది ఇక్కడితో అయిపోతుంది అంటాడు రిషీ. వసూ అందులోంచి మాది 1% కూడా తప్పులేదు..అసలు జరిగిందేంటే అని వసూ చెప్పబోతే..రిషీ ఆపుతాడు. ఇది మీరు జరిగింది ఏంటో వినరు, మీకు మీరే ఊహించుకుంటారు..ఒక మనిషి సారి చెప్తున్నారు అంటే…సంస్కారం..చేయని తప్పుకు సారీ చెప్పడమంటే..ఆత్మగౌరవం కోల్పోయినట్లే..చేయని తప్పుకు నేను సారీ చెప్పను, ఎదురుగా ఎవరు ఉన్నా భయపడేదే లేదు అని వెళ్తుంది.

రిషీ నీకు పొగరు అని ఊరికే పెట్టలేదు అనుకుంటాడు. ఇక్కడ మీటింగ్ స్టాట్ చేస్తారు. జగతి మిషన్ ఎడ్యుకేషన్ షాట్ ఫిల్మ్ గురించి చెప్తుంది. రిషీ వస్తాడు. జగతి ఎక్స్ప్ ప్లేన్ చేస్తుంది. రిషీ కిటికీలోంచి..వసూ, గౌతమ్ మాట్లాడుకోవటం చూసి చిర్రెత్తిపోతాడు. జగతి చెప్పేది వినడు. ఏమైంది రిషీ అంటే..ఈ పాయింట్స్ నాకు పూర్తిగా అర్థంకాలేదు..క్లియర్ గా రాసి మెయిల్ పెట్టండి అని వెళ్లిపోతాడు.

రిషీ క్యాబిన్ లో ఉంటే..మహేంద్ర వస్తాడు. నా మూడ్ ఏం బాలేదు..అస్సలు బాలేదు, కొటేషన్స్ అవి చెప్పకండి అంటాడు రిషీ. నేను వచ్చిందే…నీ మూడ్ ఎందుకు బాలేదో తెలుసుకోవాడనికి వచ్చాను అంటాడు మహేంద్ర. తెలుసుకోని ఏం చేస్తారు అని రిషీ అంటే..తగ్గట్టానికి ప్రయత్నిస్తాను అంటే..ప్రయత్నించట కాదు..చేయాలి అని..వసుధారతో పెద్దమ్మకు సారీ చెప్పించాలి అంటాడు. మహేంద్ర జరిగిందేంటో తెలుసుకోవాలి కదా అంటే..నేను నా కళ్లారా చూశాను కదా..పెద్దమ్మ మాట్లాడిందేమో..అయితే ఆ‌విడ వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా..అంత అహకారమేంటి ఆ పొగరికి అంటాడు రిషీ. మహేంద్ర వెంటనే ఓ రోజు పొగరు అనే నేమ్ తో రిషీకి కాల్ రావటం గుర్తుచేసుకుని..ఓహో పొగరంటే వసూధారనా దొరికావ్ రా అనుకుంటాడు. డాడ్ ఇప్పుడు మీరు గ్రామర్ సరిచేయకండి..చెప్పించగలుగుతారా లేదా అంటాడు. ఎపిసోడ్ అయిపోతుంది.