కార్తీకదీపం ఎపిసోడ్ 1196: గట్టి నిర్ణయమే తీసుకున్న దీప..ఆఖరిసారిగా ఇంట్లో వాళ్లకు తన చేత్తో వండిన వంటను పెట్టిన వంటలక్క

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత ఇంట్లో ఉన్న దీప మోనితకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. నా ధైర్యం ఏంటో నా దమ్ము ఏంటో నీకు అతి త్వరలోనే తెలుస్తుంది మోనిత..హుఫ్ అని గట్టిగా ఊదితే కొట్టుకుపోతావ్ జాగ్రత్త, ఈ దీప తలుచుకుంటే ఏం చేయగలదో చూపించబోతున్నాను, రెడిగా ఉండూ సినిమా మొదలవుతుంది, బాగా తిను మోనిత ముందు ముందు ఏడవటానికి ఓపిక కావాలికదా, ఈ దీపతో ఎందుకు పెట్టుకున్నాని అని తల గోడకేసి బాదుకునేలా చేస్తా నీ మీద ఒట్టు అని చెప్పేసి వెళ్లిపోతుంది. మోనిత ఏంటిది ప్రియమణి ఈ దీప ధైర్యం ఏంటో నాకు అర్థంకావటంలేదు అంటుంది. ప్రియమణి నాకు అదే అర్థంకావటంలేదు, చూడబోతే దీపమ్మ సినిమానే హిట్ అయ్యేలా ఉందమ్మా అంటుంది. మోనితకు టెన్షన్ మొదలవుతుంది..

ఇక్కడ ఇంట్లో ఆదిత్య అప్పుడే ఇంటికి వస్తుంటే..పిల్లలు వచ్చి అమ్మ పొద్దుననా బయటకు వెళ్లింది, ఇంకా రాలేదు అని కంగారుపడతారు. ఆదిత్య ఏమైనా గొడవజరిగిందా అంటే..గొడవలేం జరగలేదు. అడిగినా ఏవరూ చెప్పరూ అంటారు పిల్లలు. అసలు ఏమైందో నేను కనుక్కుంటాను ఉండండి అని పిల్లలను లోపలికి తీసుకెళ్లాడు. మరోపక్క మోనిత తాపీగా కాఫీ తాగుతూ..దీప అన్న మాటలను రివైస్ చేసుకుంటుంది. దీపకు అంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది. ఏడవ్వాల్సిన దీప, అసలు ఏమాత్రం వణక్కుండా, తొణక్కుండా నాకే ఛాలెంజ్ చేసి పోయిందంటే..దీప ధైర్యం ఏంటి, నావైపు నుంచి అంతా పగడ్భందీగా ప్లాన్ చేసుకున్నాను, ఎక్కడా అవకాశం ఇవ్వలేదు, ఆనంద్ రావుగారు పుట్టకముందు ఎలా ధైర్యంగా ఉందో. ఇప్పుడు అలానే ఉంది, ఏం జరిగి ఉంటుంది, ఏమై ఉంటుంది అని ఓ తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రియమణి వచ్చి ఏంటమ్మా ఆలోచిస్తున్నారు, దీపమ్మా మాట్లాడింది దానిగురించే కదా, నాకు తెలుసమ్మా, మీ ఇంటికి వచ్చి మిమ్మల్నే భయపెట్టింది అంటే..దీపమ్మ దగ్గర ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది అంటుంది. మోనిత ఊరుకుంటుుందా..నీకు అవసరంలేనివాటి గురించి ఆలోచించకు..కాఫీ బాలేదు, నిన్ను సలహాలు అడగలేదుకదా, మనుషులైనా, వస్తువులైనా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే మంచిది అని ప్రియమణిని పంపిస్తుంది.

అయినా దీప మాటలకు టెన్షన్ పడలా, మోనిత టెన్షన్ పెట్టే బ్యాచ్చే కానీ, పడే బ్యాచ్ కాదు అనుకుని దీపకు ఇస్తాను మామూలుగా ఇవ్వను అని ఫోన్ తీస్తుంది. కార్తీక్ కారులో దీప కోసం వెతుకుతూ ఉంటాడు. మోనిత నేనేంటి కార్తీక్ కి ఫోన్ చేయటం మర్చిపోయాను, ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని ఫోన్ చేయటం మానేస్తానా , నా స్టాఫ్ పేర్లతో బోల్డెన్ని సిమ్ కార్డులు ఉన్నాయు కదా వాటితో చేస్తాను, లిప్ చేయక చస్తాడా అనుకుంటుంది. ఇకకడ కార్తీక్ దీపకోసం వెతుకుతూ ఉంటాు. అన్ నోన్ నంబర్ నుంచి కాల్ రావటంతో కార్తీక్ ఎత్తుతాడు. మోనిత డాక్టర్ బాబు అనటంతో దీప నువ్వేనా అంటాడు. మోనిత వెకిలి నవ్వు నవ్వుతుంది. నువ్వా అని కార్తీక్ అంటే..నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మానేస్తాను అనుకున్నావా, నా దగ్గర చాలా నంబర్లు ఉన్నాయ్ నాకు ఇదే పని అంటుంది. కార్తీక్ కాల్తుంది. నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు,నువ్వు ఎవరో నేను ఎవరో అంటాడు. ఇద్దరం కలిసి గుళ్లో పూజ చేశాం, ఇంకా ఏంటి కార్తీక్ విశేషాలు, దీప ఏం అంటుంది, నన్ను తలుచుకుని ఏడుస్తుందా, చూడు కార్తీక్ ఇప్పుడు నుంచి కథ ఇంకా రసవత్తరంగా ఉండబోతుంది. దీపను నెత్తికి ఎక్కించుకున్నావో, నేను దానిని పాతాలానికి తొక్కేస్తాను అంటుంది మోనిత.

కార్తీక్ ఇంకొక్క మాట మాట్లాడిన మర్యాదగా ఉండదు అని కాల్ కట్ చేస్తాడు. ఈ మోనిత ఏంటో ఈమె ప్రేమ ఏంటో..చూసేవాళ్లకు, యాక్ట్ చేేసవాళ్లకు చిరాకు తెప్పించేలా ఉంది కథ. ఇంట్లో సౌందర్య, ఆనంద్ రావులు దీప రాలేదని టెన్షన్ పడుతుంటారు. చేసిందంతా చేసి ఇప్పుడు టెన్షన్ పడితే ఏం లాభం సౌందర్య, దీప చూసిందని ఇప్పుడు టెన్షన్ పడుతున్నావ్ అంటాడు. సౌందర్య సేమ్ స్టోరీ చెప్తుంది. కార్తీక్ కి ఏదైనా జరిగితే పూజ చేశాను. దీప చూస్తుందని నేనెలా అనుకుంటాను అండి. పిల్లల కోసం కూడా దీప ఇంటికి వస్తుందని నేను అనుకోవటం లేదు సౌందర్య అంటాడు అనంద్ రావు అంటాడు. మీరు ఇలా అంటుంటే భయమేస్తుంది అండి అంటుంది సౌందర్య. దీప వస్తుందనే నమ్మకం నాకైతే లేదు, సరిదిద్దుకోలేని తప్పు చేశామ్, దీపకు వాడు అన్యాయం చేశాడు. నువ్వు తెలిసి ద్రోహం చేశావ్ అంటాడు. సౌందర్య దీపను ఎలా అయినా నువ్వే ఇంటికి చేర్చాలి అని దేవుడ్ని కోరుకుంటుంది.

తల్లికోస పిల్లలు ఇద్దరూ ఇంటి ముందు కుర్చోని ఉంటారు. అమ్మ ఏటెళ్లింది అని హిమ అడిగితే..నాకేం తెలుసు అని వాళ్లు ఇద్దరూ మాట్లాడుకుంటారు. వాళ్లు అలా మాట్లాడుకుంటుండగానే..దీప ఆటోలో కూరగాయలు తీసుకుని దిగుతుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్ కారులో వస్తాడు. కార్తీక్ ను చూసిన దీప ఆ గుడిసీన్ రివైజ్ చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్లావ్ దీప అని అడుగుతాడు..అప్పుడే పిల్లలు వచ్చి ఎక్కడికి వెళ్లావ్, అమ్మా నువ్వు నాన్న కారులో రావొచ్చుకదా, ఆటోలో ఎందుకు వచ్చావ్ అని శౌర్య అడుగుతుంది. దారులు వేరమ్మా, మీ నాన్న దారి వేరు, నా దారి వేరు, ఇద్దరం ఒకే కారులో ఎలా ప్రయాణిస్తాం అంటుంది. హిమ ఇవన్నీ ఏంటమ్మా అంటే..మార్కెట్ కి వెళ్లి చాలా రోజులైంది కదా అందుకే వెళ్లొచ్చాను అంటుంది. ఇంత షాపింగ్ ఈమధ్యకాలంలో చేయలేదు అప్పుడెప్పుడో బస్తీలో ఉన్నప్పుడు చేసేదానివి అంటుంది శౌర్య. అప్పుడే బాగుండేది అమ్మా, మన బతుకు మనం బతికేవాళ్లం అంటుంది దీప. బస్తీ షాపింగ్ ఇప్పుడేందుకు అమ్మా అవసరమా అని శౌర్య అడుగుతుంది. అలవాటు పోతే..తర్వాత ఇబ్బంది అవుతుంది కదమ్మా, అలవాటు తప్పకూడదు, భూమి గుండ్రంగా ఉంది అంటారు, ఏమో ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా అందుకే ఈరోజు వెళ్లాల్సి వచ్చింది అంటుంది. శౌర్య, దీప మాత్రమే ముందుకు నడుచుకుంటూ వెళ్తారు. ఎపిసోడ్ అయిపోతుంది.

తరువాయిభాగంలో అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. ఆదిత్య వదినా నువ్వురాలేదని పిల్లలు ఇందాక చాలా టెన్షన్ పడ్డారు అంటాడు. దీప చాలా నార్మల్ గా నేను ఎటు వెళ్తాను రా, అయినా నాకు ఏమైనా అయినా మిమ్మల్ని చూసుకోవటానికి నానమ్మ ఉంది. అందరూ ఉన్నారు కదా అని..డాక్టర్ బాబు గుత్తివంకాయ, దోసకాయపచ్చడి చేశాను, మళ్లీ ఎప్పుడు తింటారో ఏంటో..గుత్తివంకాయ కూరకు ఎన్ని మార్కులు ఇస్తారు డాక్టర్ బాబు అంటే..పదికిపది అంటాడు కార్తీక్. అబద్ధాలు చెబుతున్నారు డాక్టర్ బాబు అన్నీ అబద్ధాలే చెబుతున్నారు అని కంటినిండా నీళ్లతో వంటగదిలోకి వెళ్తుంది. దీన్నిబట్టి చూస్తే వంటలక్క ఏదో గట్టినిర్ణయమే తీసుకున్నట్లు కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news