కార్తీకదీపం ఎపిసోడ్ 1239: దీప పిండివంటల బిజినెస్ ని కార్తీక్ చేతే ఆపించే ప్లాన్ చేసిన రుద్రాణి

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప పిండి జల్లెడ పడుతుంటే..పిల్లలు వచ్చి వంటలు నేర్పించమంటారు. వద్దమ్మా..వంటలక్క అనే బిరుదు నాతోనే ముగిసిపోవాలి అంటుంది దీప. వీళ్లు ఇలా మాట్లాడుకుంటుండగా..కార్తీక్ వస్తాడు. పిల్లలు తండ్రి దగ్గరకు వెళ్లి.. ఈ ఊరు వదిలేసి వెళ్దాం అంటారు. ఎందుకుమ్మా అని కార్తీక్ అడిగితే..తమ్ముడు మన తమ్ముడు కాదంటున్నారు..అందుకే వేరే ఊరువెళ్లి..వీడు మన సొంత తమ్ముడు అని చెప్దాం అంటారు. వాడు పెద్దయ్యాక సొంత తమ్ముడు కాదని తెలిస్తే బాగోదు కదా అంటారు. కార్తీక్ మనం ఈ ఊరు వదిలి వెళ్లలేం అంటాడు. ఎందుకు అని అడుగుతారు దీప-పిల్లలు. కార్తీక్..అప్పుతీరుస్తానంటూ రుద్రాణికి చెప్పిన మాటలు గుర్తుచేసుకుని.. మ్యాటర్ డైవర్ట్ చేస్తాడు. దీప అప్పు తీర్చటంలో ఎందుకు టెన్షన్.. ఇంటిని వదిలేస్తే రుద్రాణి తీసుకుంటుంది కదా అప్పుడు మనం అప్పు తీర్చాల్సిన పనిలేదు కదా అంటుంది. అలా చేస్తే శ్రీవల్లి-కోటేష్ ల చావుకి అర్థం లేకుండా పోతుంది..ఎందుకంటే ఇది కోటేష్ పూర్వీకుల ఆస్తి కాబట్టి దీనికి వారసుడు ఆనంద్ అవుతాడు.. అలాంటప్పుడు ఇల్లు రుద్రాణికి అప్పగిస్తే వీడికి మనం అన్యాయం చేసినట్టు అవుతుంది కదా అంటాడు. దీప ఇంత దూరం ఆలోచించలేదంటుంది…డాక్టర్ బాబు ఏదో విషయం నా దగ్గర దాస్తున్నారా అని మనసులో అనుకుంటుంది.

సౌందర్య ఇంట్లో…

సౌందర్య పిల్లల పుస్తకాలు వెతుకుతుంది. ఆనంద్ రావు వచ్చి ఏం వెతుకుతున్నావ్ అంటే..పిల్లల పుస్తకాలు వెతుకున్న వాళ్ల చేతిరాత చూసినా ఆనందంగా ఉంటుందని సౌందర్య అంటుంది. కనిపించటంలేదేంటి అంటే..ఆదిత్య అవన్నీ సర్ధి స్టోర్ రూంలోపెట్టాడు అంటాడు. ఇన్ని సౌకర్యాలు వదిలేసి ఎక్కడుంటున్నారో ,ఏం తింటున్నారో, అసలు పిల్లలు స్కూల్ కి వెళుతున్నారో లేద కూడా తెలియడం లేదు, పాపం పిల్లలు ఏం చేశారని వాళ్లకీ శిక్ష అని సౌందర్య బాధపడుతుంది. సౌకర్యాల్లో సంతోషం లేదు సౌందర్య..వాళ్లు మనకు దూరమయ్యారే కానీ సంతోషానికి దూరమయ్యారని ఏమాత్రం అనుకోవద్దు.. వస్తారు సౌందర్య.. ఏదో ఒక రోజు మన దగ్గరకు వస్తారని చెబుతాడు ఆనందరావు.

మరోవైపు బస్తీలో లక్ష్మణ్, అతడి భార్య.. మోనిత గురించి మాట్లాడుకుంటారు. ‘మోనితని దూరం పెట్టడం కరెక్ట్ కాదేమో.. ఆ బాబు కార్తీక్ బాబు వాళ్ల బాబే అని అనుకుంటున్నారు అంతా.. పైగా పూజలు కూడా చేయించారట కార్తీక్ బాబు వాళ్ల అమ్మగారు. అంటే మోనితదే తప్పు అని అనుకోలేం కదయ్యా అంటుంది. లక్ష్మణ్…పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటే.. నిప్పులేనిదే పొగరాదు కదయ్యా’ అంటూ మోనితకి అనుకూలంగా మాట్లాడుతుంది. దాంతో లక్ష్మణ్ ఆలోచనలో పడతాడు. అంటే మెల్లిగా బస్తీవాళ్లు మోనిత వైపు తిరుగుతున్నారేమో.

దీప బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అక్కడకు కార్తీక్ వస్తాడు. దీప మీకోసమే చూస్తున్నాను అంటుంది. నేను ముళ్ల చెట్టు లాంటివాడిని, నీడనివ్వలేనని బాధపడతాడు. నేను ఒక పనికిరానివాడ్ని అయిపోయాను, నా కళ్ల ముందు ఒక అమ్మాయి పురిటినొప్పులతో బాధపడుతుంటే వైద్యం చేయలేకపోయాను, శ్రీవల్లి-కోటేశ్ కి అన్యాయం జరిగినా నోరు విప్పలేకపోయాను, రుద్రాణి నువ్వు చేసింది తప్పు అని అరిచి లోకానికి చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయాను, కాళ్లకు మట్టి అంటకుండా పెరిగిన పిల్లలకి కాళ్లకి చెప్పుల్లేకుండా ఉన్న పరిస్థితి తీసుకొచ్చాను, కడుపునిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. ఏంటి దీప ఇది…నా దగ్గర ఇంకా తగ్గించుకునేందుకు ఏముందని అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నేను బాధపడాననో, ఏదైనా చేసుకుంటాననో నువ్వు నాకు ధైర్యం చెబుతున్నావు కానీ నేనేంటి, నేనెవరు అని ప్రశ్నిస్తాడు. డాక్టర్ ని అయిండి వైద్యం చేయలేకపోతున్నాను, మనిషినా మనిషి అయిండి సాయం చేయలేకపోతున్నాను, తండ్రినా- పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను, పోనీ ఒక భర్తనా- ఏ బాధ్యతా తీసుకోకుండా నువ్వు పనిచేస్తుంటే..నేను కళ్లప్పగించి చూస్తున్నాను అంటాడు. మీరు ఇన్ని చెప్పారు కదా నేనొక మాట చెప్పాను వినండి అని..మీకు ఇష్టమైన పని-మీరు చేతనైన పని ఏదో ఒకటి చేయండి చాలు అప్పుడైనా మీకు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయ్…బాబును చూస్తూ ఉండండి నేను ఇవన్నీ అమ్మేసి వస్తాను అని వెళ్తుంది.

సౌందర్య స్టోర్ రూమ్ కి వెళ్లి పిల్లల పుస్తకాలు చూసి వాళ్లు అడిగే ప్రశ్నలు, మధురజ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఏడుస్తుంది. మనవరాళ్లను తలుచుకుని..వాళ్లు అడిగే ప్రశ్నలుతో కోపం తెప్పించేవారు..అసలు ఎక్కడికిపోయారే ఈ నాన్నమ్మను వదిలేని అని బాదపడుతుంది. ఇంతలో స్టోర్ రూమ్ లో మోనిత-కార్తీక్ ఫొటో చూసి కోపంతో రగిలిపోతుంది. ఈ ఫొటోను తీసుకెళ్లి కుప్పతొట్టలో విసిరేయకుండా ఎందుకింత భద్రంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని కోపంగా అది బయటకు తీసుకొచ్చి విసిరేస్తుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడకు వచ్చిన మోనిత ఆ ఫొటోని పట్టుకుంటుంది. నమస్తే ఆంటీ గారూ మీరు విసిరేస్తే క్యాచ్ పట్టుకున్నా, బాగానే పట్టుకున్నా కదా…నేను దీనికోసమే వచ్చాను..నా మనసు తెలుసుకున్నట్టే మీరు నాకు ఇచ్చారు..నేను న్యూ ఇయర్ గిఫ్ట్ గా భావిస్తాను ఆన్టీ అంటుంది. ఇక మోనిత తన ఓవర్ యాక్షన్ డైలాగ్స్ తో సౌందర్యను, ప్రేక్షకులకు విసుగుతెప్పిస్తోంది. కొన్ని అనుకుంటాం కానీ అవి జరగవు, మీరు నన్ను ఫ్యామిలీ లోంచి పంపిద్దామనుకున్నారు, నేను దగ్గరవుదాం అనుకుంటున్నా అంటుంది. సౌందర్య అప్పుడే.. మిడిసిపడకు మోనిత అని సౌందర్య అంటే.. వెళ్లొస్తాను.. నా కార్తీక్ తో నా బిడ్డతో ఈ ఇంట్లో అడుగుపెడతాను, అప్పుడు మీరే హారతిచ్చి రమ్మంటారని వెళ్లిపోతుంది.

బాబుని ఒళ్లోకి తీసుకున్న కార్తీక్.. ఏంట్రా నీ ఒళ్లు ఇలా కాలిపోతుంది..అనుకోని అతిథిగా మా కుటుంబంలోకి వచ్చావ్, ఈ పేదరికంలో నిన్నెలా బాగా చూసుకోవాలి అనుకుని శ్రీవల్లి, కోటేష్ వాళ్ల ఫోటో దగ్గరకు వెళ్తాడు. ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి శ్రీవల్లి – కోటేశ్ కొడుకయ్యావు. వాళ్లు వెళ్లిపోయారు, నువ్వు ఒంటరిగా మిగిలిపోయావ్.. బాధపడకురా..నీకు మేం ఉన్నాం, వీళ్లిద్దరు ఆత్మలు పుణ్యలోకాలకు వెళ్లాలని కోరుకుందాం.. నా బిడ్డలతో సమానంగా చూసుకుంటాను నానుంచి ఎవ్వరూ వేరు చేయలేరు అనుకుంటాడు. పాలు తాగుతావా నాన్న అని బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి పాల కోసం వెళతాడు కార్తీక్. మరోవైపు రుద్రాణి… దీపా పిండివంటలు చేస్తూ నా అప్పు తీరుస్తుందా..ఎన్ని వంటలు చేసి తీరుస్తావు, నేను వంటలు ఆపడం కాదు దాని మొగుడి చేతే ఆపేలా చేయిస్తా అనుకుంటుంది. కార్తీక్ బాబుకు పాలుపట్టిస్తుంటే..రుద్రాణి వస్తుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news