సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీంలో బంగారంపై పెట్టుబ‌డి పెడితే క‌లిగే లాభాలివే..!

-

దేశంలో ప్ర‌జ‌లు బంగారంపై పెట్టుబ‌డి పెట్టేందుకు గాను కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న అద్భుతమైన స్కీం.. సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీం (ఎస్‌జీబీ) అని చెప్ప‌వ‌చ్చు. ఇందులో భాగంగా పెట్టుబ‌డి దారులు ఆన్ లైన్‌లోనే డిజిట‌ల్ రూపంలో బంగారం కొని పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. లేదా పొదుపు చేసుకోవ‌చ్చు. అయితే ఎస్‌జీబీ స్కీం కింద బంగారంపై పెట్టుబ‌డి పెట్టేవారికి అనేక లాభాలు ఉంటాయి. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

10 benefits of sovereign gold bonds

1. సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీం కింద బంగారంపై పెట్టుబ‌డి పెట్టే వారికి ఏడాదికి 2.50 శాతం ఫిక్స్‌డ్ వ‌డ్డీ ల‌భిస్తుంది. అలాగే వ‌డ్డీ ప్ర‌తి 6 నెల‌ల‌కు ఒక‌సారి క‌స్ట‌మ‌ర్ అకౌంట్‌లో జ‌మ అవుతుంది.

2. సావ‌రిన్ గోల్డ్ బాండ్‌ల‌ను చిన్న ఆర్థిక సంస్థ‌లు, బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్స్ కాకుండా ఇత‌ర ఏ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కంపెనీలు, పోస్టాఫీస్‌, స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల నుంచి అయినా కొన‌వ‌చ్చు.

3. ప్యూరిటీ 999 ఉండే బంగారానికి సావ‌రిన్ గోల్డ్ బాండ్‌ల బంగారం ధ‌ర‌లు లింక్ అయి ఉంటాయి.

4. బంగారాన్ని ఆన్‌లైన్‌లో డిజిట‌ల్ రూపంలో కొంటారు క‌నుక బంగారం పోతుంద‌నే బెంగ ఉండదు. భౌతిక రూపంలో ఉండే బంగారం అయితే పోతుందేమోన‌ని భ‌యం క‌లుగుతుంది.

5. సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీం కింద బంగారంపై పెట్టుబ‌డి పెడితే మెచూరిటీ స‌మ‌యంలో ఉన్న బంగారం ధ‌ర‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వ‌డ్డీ చెల్లిస్తారు.

6. సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీం కింద పెట్టుబ‌డి పెడితే బంగారం ప్యూరిటీపై దిగులు చెందాల్సిన ప‌ని ఉండ‌దు. అలాగే మేకింగ్ చార్జెస్ బాధ ఉండ‌దు.

7. సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీం కింద కొనే బాండ్స్ ను ఎక్స్ ఛేంజ్ చేసుకోవ‌చ్చు.

8. సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీం కింద వ‌చ్చే వ‌డ్డీపై ప‌న్ను విధిస్తారు. కానీ ప‌లు సంద‌ర్బాల్లో ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు.

9. సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీం కింద తీసుకునే బాండ్స్ పై లోన్లు ఇస్తారు.

10. భార‌త ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావ‌రిన్ గోల్డ్ బాండ్‌ల‌ను ఇస్తుంది. క‌నుక మ‌న పెట్టుబ‌డికి పూర్తి భ‌ద్ర‌త ఉంటుంది. అలాగే ఆన్ లైన్‌లో ఈ స్కీం కింద పెట్టుబ‌డి పెట్టే వారికి మార్కెట్ రేట్ క‌న్నా కొద్దిగా త‌క్కువ ధ‌ర‌కే బంగారం వ‌స్తుంది. అలాగే ప్ర‌తి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news