మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే బీ అలర్ట్..

-

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక..ఫోన్లో కొన్ని యాప్ లను వాడితే మోసపోయే అవకాశం ఉందని, కొత్త యాప్ ల విషయం లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గతంలో చాలా అలర్ట్ లను కూడా జారీ చేసింది. ఖాతా వినియోగదారులు వారి మొబైల్ ఫోన్లలో ఉపయోగించకూడని కొన్ని యాప్స్ గురించి హెచ్చరికాలు కూడా జారీచేసింది. వాటిలో ముఖ్యమైనని ఒక 4 యాప్స్  ఉన్నాయి.. గతంలో ఈ యాప్స్ వాడిన కారణంగా 150 మందికి పైగా ఖాతాదారులు 70 లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు కూడా తెలిపింది. అందుకే, అటువంటి యాప్స్ ని SBI కస్టమర్లు వారి ఫోన్లలో వాడకపోవడం మంచిది.

ఆ నాలుగు యాప్స్ విషయాన్నికొస్తే.. ఎనిడెస్క్  క్విక్ సపోర్ట్ , టీమ్ వ్యూవర్ , మింగిల్ వ్యూ యాప్ లను ఇన్స్స్టాల్ చేసుకోవద్దని SBI తన కస్టమర్లను హెచ్చరించింది..వీటి వల్ల డేటా చొరికి గురి అవుతుందని హెచ్చరిస్తున్నారు..ఇకపోతే తెలియని వ్యక్తుల నెంబర్ల నుంచి ఒరిజిన్ నుండి ఏదైనా యుపిఐ కలెక్ట్ రిక్వెస్ట్ లేదా క్యుఆర్ వస్తే వాటిని  స్వీకరించ వద్దని విజ్ఞప్తి చేసింది.బ్యాంక్ వెబ్ సైట్ నుండి హెల్ప్ లైన్ కోసం వెతికేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే, ఆన్లైన్లో ఆరు కంటే పైచిలుకు నకిలీ  బ్యాంక్ వెబ్ సైట్స్ ఉన్నాయి. అందుకే, ఏదైనా పరిస్కారం కోసం సంప్రదించవలసిన సమయంలో సరైన అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించండి.. లేదంటే మీ ఖాతా నుంచి డబ్బులు మాయం అవుతాయి.. సైబర్ నేరగాల్లు రోజు రోజుకు పెరిగి పోతూన్నారు తస్మాత్ జాగ్రత్త..

Read more RELATED
Recommended to you

Exit mobile version