వాటే పాలసీ.. రూ.40 పొదుపుతో రూ.39 లక్షలు…!

ఎల్‌ఐసీ ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. వీటి వలన మంచి ప్రయోజనాలని పొందొచ్చు. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందిస్తున్న పాలసీలలో జీవన్ ఉమాంగ్ కూడా ఒకటి. దీనితో చక్కటి లాభాలని పొందొచ్చు. ఇక ఈ పాలసీకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC అందిస్తున్న జీవన్ ఉమాంగ్ లాభదాయకంగా ఉంటుంది. జీవన్ ఉమాంగ్ పాలసీని ఇప్పటికే ఎంతో మంది తీసుకున్నారు. 55 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే జీవన్ ఉమాంగ్ పాలసీ వల్ల 100 ఏళ్ల వరకు పాలసీ కవరేజ్ లభిస్తుంది.

జీవన్ ఉమాంగ్ పాలసీ అనేది ఎండోమెంట్ పాలసీ. దీనిలో కనుక చేరితే లైఫ్ కవర్‌తో పాటు డబ్బులు కూడా వస్తాయి. ఇలా అద్భుతమైన ఈ రెండు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇక ఈ పాలసీ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అనేది చూస్తే..

30 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.5 లక్షలకు బీమా మొత్తానికి 30 ఏళ్ల ప్రీమియం టర్మ్‌తో పాలసీ కనుక తీసుకున్నట్టు అయితే నెలకు దాదాపు రూ.1280 ప్రీమియం పడుతుంది. అయితే ఇక్కడ మీరు 30 ఏళ్ల ప్రీమియం టర్మ్‌తో తీసుకోవాలని ఏమి లేదు.

కావాలంటే మీరు 15, 20, 25, 30 ఏళ్ల టర్మ్‌తో పాలసీ అయినా తీసుకోచ్చు. మీరు 30 ఏళ్లు ప్రీమియం చెల్లించి ఉంటే మీకు 60 ఏళ్లు వచ్చి ఉంటాయి.

ఇప్పుడు మీకు ప్రతి ఏడాది రూ.40 వేలు వస్తాయి. ఇలా మీకు ప్రతి ఏడాది డబ్బులు వస్తాయి. ఒకవేళ మీరు 100 తర్వాత కూడా ఉంటే అప్పుడు బోనస్, ఎఫ్ఏబీ, బీమా ప్రయోజనాలు కూడా మీకు వస్తాయి.