అదిరే స్కీమ్… రూ.7తో రూ.60 వేలు…!

-

కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే కేంద్రం అందిస్తున్న స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పైగా మంచిగా డబ్బులొస్తాయి. ఇందులో చేరడం వల్ల పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.

money
money

మరి ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇప్పుడు ఈ పథకంలో ఎవరైనా చేరొచ్చు. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు అర్హులు. 60 ఏళ్ల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిలో మీరు డిపాజిట్ చేసిన దాని బట్టి నెలకి వెయ్యి, రెండు వేలు లేదా ఐదు వేలు ఇలా పెన్షన్ ని పొందొచ్చు. కామన్ సర్వీసె సెంటర్‌కు వెళ్లి పథకంలో చేరొచ్చు.

మీరు కనుక ఈ స్కీమ్ ద్వారా నెలకి ఐదు వేలని పొందాలని అనుకుంటే నెలకు రూ.210 కడుతూ వెళ్లాలి. అంటే రోజుకు రూ. 7 పొదుపు చేస్తే చాలు. ఇక ఎవరు ఇందులో చేరచ్చు అన్నది చూస్తే.. 18 ఏళ్ల వయసులో ఈ స్కీమ్‌లో చేరచ్చు. 60 ఏళ్ల వరకు డబ్బులు పెడుతూనే ఉండాలి.

వయసు పెరిగే కొద్ది మీరు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతూ వస్తుంది. నెలకు రూ. 42 డిపాజిట్ చేయాలని అనుకుంటే నెలకు రూ.1000 పెన్షన్ వస్తుంది. రూ.2 వేలు పొందాలని అనుకుంటే నెలకు రూ.84 కడుతూ రావాలి. రూ. 3 వేల పెన్షన్ కోసం మంత్లీ డిపాజిట్ రూ. 126గా ఉంది. అదే మీరు రూ. 168 కడితే రూ. 4 వేలు పెన్షన్ వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా ఈ స్కీమ్ తో పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news