నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ : ఇంటర్‌తో కేంద్ర ఉద్యోగాలు

-

సీహెచ్‌ఎస్‌ఎల్-2019

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎల్‌డీసీ, పోస్టల్ అసిస్టెంట్, డీఈవో పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2018 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
సీహెచ్‌ఎస్‌ఎల్ ఎగ్జామ్: భారత ప్రభుత్వ పరిధిలోని పలు మంత్రిత్వశాఖల్లో, విభాగాల్లో, కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి సీహెచ్‌ఎస్‌ఎల్ ఎగ్జామ్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏటా నిర్వహిస్తుంది.
ఖాళీలసంఖ్య- ప్రస్తుతం ఖాళీల సంఖ్యను ఎస్‌ఎస్‌సీ ప్రకటించలేదు. తర్వాత ప్రకటిస్తామని ప్రకటనలో తెలిపింది. గత కొన్నేండ్ల ప్రకటన ఆధారంగా కొలువుల సంఖ్య ఐదు నుంచి ఎనిమిదివైల మధ్య ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Central Jobs With inter qualification
Central Jobs With inter qualification

పోస్టు: లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ)
పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్‌పే రూ.1,900
పోస్టు: పోస్టల్ అసిస్టెంట్ (పీఏ)/సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)
పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్‌పే రూ.2,400
పోస్టు: డాటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)
పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్‌పే రూ.2,400
పోస్టు: డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ
పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్‌పే రూ.2,400
విద్యార్హతలు: 2019, ఆగస్టు 1 నాటికి ఎల్‌డీసీ/జేఎస్‌ఏ, పీఏ/ఎస్‌ఏ, డీఈవో (కాగ్‌లో డీఈవో పోస్టులకు తప్ప) – గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత.
కాగ్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి ఇంటర్ సైన్స్ స్ట్రీమ్‌లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 1992, ఆగస్టు 2 నుంచి 2001,ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం:
– కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టైర్-I, డిస్క్రిప్టివ్ పేపర్ టైర్-II, స్కిల్‌టైస్ట్/టైపింగ్ టెస్ట్ టైర్-III.
టైర్-I పరీక్ష:
– ఈ పరీక్షలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నప్రతం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది.
పరీక్ష తేదీ: 2019, జూలై 1 నుంచి జూలై 26 వరకు నిర్వహిస్తారు.
– పరీక్షలో ఇంగ్లిష్ (బేసిక్ నాలెడ్జ్), జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్), జనరల్ అవేర్‌నెస్.
– ప్రతి సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నలు, 50 మార్కులు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు, 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
– పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
– నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కుల కోత విధిస్తారు.
– టైర్-Iలో నార్మలైజ్డ్ పద్ధతిలో మార్కులను ప్రకటిస్తారు. తుది ఎంపికకు ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

టైర్-II పరీక్ష:

– ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. 100 మార్కులకు పెన్ అండ్ పేపర్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
– ఈ పరీక్షలో కనీస అర్హత మార్కులు 33 శాతం రావాలి.
– ఈ పరీక్షలో వచ్చిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.

టైర్-III పరీక్ష:

– స్కిల్‌టెస్ట్/టైపింగ్ టెస్ట్‌ను కంప్యూటర్స్‌పై నిర్వహిస్తారు.
– ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
నోట్: టైర్-Iలో వచ్చిన మార్కుల ఆధారంగా టైర్-IIకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. కేటగిరీల వారీగా వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. టైర్-I, IIలో వచ్చిన మార్కుల ఆధారంగా టైర్-IIIకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 5 (సాయంత్రం 5 గంటల వరకు)
ఫీజు: రూ.100/-
నోట్: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఫీజు లేదు)
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఏప్రిల్ 7
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
టైర్-I పరీక్ష తేదీలు: 2019, జూలై 1 నుంచి జూలై 26 మధ్య నిర్వహిస్తారు.
టైర్-II పరీక్షతేదీ 2019, సెప్టెంబర్ 29
వెబ్‌సైట్: https://ssc.nic.in.

– కేశవ

ఈ విలువైన స‌మాచారం మీకు ఉప‌యోగం ఉన్నా లేక‌పోయిన‌ మీ మిత్రుల‌కు, బంధువుల‌కు ఏవ‌రికైనా ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు ద‌య‌చేసి షేర్ చేయండి

Read more RELATED
Recommended to you

Latest news