మోదీ ఇస్తున్న 5 లక్షల రూపాయల ప్రయోజనం కోసం ఇలా చెయ్యండి..!

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ యోజన కింద మోదీ ప్రభుత్వం 50 కోట్ల మందికి ఎటువంటి వివక్ష లేకుండా 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అందుబాటులో ఉంచినట్లు చెబుతుంటారు. అయితే మీరు లబ్ధిదారులేనా లేదా అనేది చూడాలంటే 14555 / 1800111565 డయల్ చేయవచ్చు. అలానే మీరు కావాలంటే సాధారణ సేవా కేంద్రం సహాయం కూడా తీసుకో వచ్చు.

 

Narendra-Modi
ఆయుష్మాన్ భారత్ | Ayushman Bharat

https://mera.pmjay.gov.in/search/login లింక్‌ ద్వారా మీ అర్హతను తనిఖీ చేయవచ్చు. ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ చికిత్స కూడా పొందొచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కరోనా చికిత్స కోసం కూడా డబ్బులు పొందొచ్చు. ఈ పథకంలో, 1350 వ్యాధుల చికిత్స ఉచితం. క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, రేడియాలజీ వంటి తీవ్రమైన మరియు చాలా ఖరీదైన వ్యాధులు వీటిలో ఉన్నాయి.

ఈ పథకం కింద, క్లినికల్ ట్రీట్మెంట్, హెల్త్ ట్రీట్మెంట్ మరియు మందులు 3 రోజుల ముందు మరియు ఆసుపత్రిలో చేరిన 15 రోజుల తరువాత లభిస్తాయి. ఏ వయస్సు వారైనా పరవాలేదు. ఈ పథకం కింద కుటుంబ పరిమాణం, వయస్సు లేదా లింగంపై పరిమితి లేదు. అలానే ఇది మొదటి రోజు నుండి ముందుగా ఉన్న వివిధ వైద్య పరిస్థితులు మరియు తీవ్రమైన వ్యాధులను వర్తిస్తుంది.