Amazon లో గిఫ్ట్ కార్డులను ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసా..?

-

ఈ మధ్య కాలంలో అమెజాన్ ను ఎక్కువగా వాడుతున్నారు.కొన్ని ప్రముఖ కంపెనీలు గిఫ్ట్ కార్డులను కూడా ఇస్తారు.అయితే యాడ్ చేసుకొవాలో చాలా మందికి తెలియదు..గిప్ట్ కార్డులు పొందిన యూజర్లకు దాన్ని అమెజాన్లో యాడ్ చేసుకోవడం ద్వారా వారి Amazon పే లోకి బ్యాలెన్స్ వస్తుంది. ఇలా గిప్ట్ కార్డుల రూపంలో వచ్చిన నగదును యూజర్లు అమెజాన్లో షాపింగ్ కు ఉపయోగించుకోవచ్చు. అయితే, అమెజాన్ గిప్ట్ కార్డులను ఎలా యాడ్ చేసుకోవాలి అనే విషయం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం…

ఫోన్‌లో కార్డును ఎలా యాడ్ చేసుకోవాలి అంటే..

1.Amazon మొబైల్ యాప్‌ని తెరవండి.
2. కింద మూలలో మెను చిహ్నంపై క్లిక్ చేయండి.
3. ఆ తర్వాత మీకు మీకు స్క్రీన్ పైభాగంలో Amazon Pay సెక్షన్ కనిపిస్తుంది.
4. దానిపై క్లిక్ చేస్తే మీకు మీ అమెజాన్ పే బ్యాలెన్స్ కనిపిస్తుంది.
5. అమెజాన్ పే బ్యాలెన్స్ సెక్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే.. గిప్ట్స్ విభాగం కనిపిస్తుంది.
6. అందులో యాడ్ ఎ గిప్ట్ కార్డు అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
7. అమెజాన్ మిమ్మల్ని ఓ బాక్సులో 14 అక్షరాల అమెజాన్ గిప్ట్ కోడ్ ను ఎంటర్ చేయమని అడుగుతుంది.
8. ఆ బాక్సులో 14 అక్షరాల కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మీ అమెజాన్ పే బ్యాలెన్స్ ఖాతాకు గిప్ట్ కార్డు నగదు యాడ్ అయిపోతుంది..

ఇక సిస్టమ్ లో ఎలా యాడ్ చెయ్యాలంటే..

1. ముందుగా వెబ్ లో అమెజాన్ ను ఓపెన్ చెయ్యాలి.
2.స్క్రీన్ పైభాగంలో ఎడమవైపు మూలలో మెనూ పక్కన పలు ఆప్షన్లు కనిపిస్తాయి.
3. అందులో మీరు Amazon Pay బ్యాలెన్స్‌ సెక్షన్ పై ట్యాప్ చేయాలి.
4. ఆ సెక్షన్ లో మీరు మీ అమెజాన్ పే బ్యాలెన్స్ ను చూడవచ్చు. దాని కింద మీకు పలు ఆప్షన్లు కనిపిస్తాయి.
5. వాటిలో యాడ్ గిప్ట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
6. అమెజాన్ మిమ్మల్ని ఓ బాక్సులో 14 అక్షరాల అమెజాన్ గిప్ట్ కోడ్ ను ఎంటర్ చేయమని అడుగుతుంది.
7. ఆ బాక్సులో 14 అక్షరాల కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మీ అమెజాన్ పే బ్యాలెన్స్ ఖాతాకు గిప్ట్ కార్డు నగదును సక్సెస్ ఫుల్గా యాడ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news