కిసాన్ క్రెడిట్ కార్డ్ పధకం ప్రయోజనాలు పొందాలంటే ఇవి తెలుసుకోండి..!

-

PM కిసాన్ యోజన కిసాన్ క్రెడిట్ కార్డ్‌ ( Kisan Credit Card‌ )తో రైతులకి అదిరే లాభాలు ఉంటాయి. రైతుల కోసం ప్రభుత్వం ఈ పధకం ప్రారంభించడం జరిగింది. అయితే రైతుల కోసం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కూడా ఒకటి. రైతులు తప్పక ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది.

కిసాన్ క్రెడిట్ కార్డ్‌ | Kisan Credit Card‌
కిసాన్ క్రెడిట్ కార్డ్‌ | Kisan Credit Card‌

కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం PM కిసాన్ సమ్మన్ నిధి యోజనతో ముడిపడి ఉంది. ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం 2.5 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఈ ప్రత్యేక క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు రూ .2 లక్షల కోట్ల రుణం వస్తుంది. అదే ప్రభుత్వ లక్ష్యం కూడా. కిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి, రైతులు సాధారణ ఫారమ్‌ను మాత్రమే పూరించాలి. Pmkisan.gov.in వెబ్‌సైట్ నుండి మీరు ఈ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అలానే దీని కోసం ప్రత్యేకంగా KYC చేయవలసిన అవసరం లేదు. కనీసం 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అర్హులు. గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు ఉండాలి. ఇక రుణం గురించి చూస్తే.. రైతులు వ్యవసాయం కోసం సులభంగా రూ. 3 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ఈ మొత్తాన్ని రైతు 4 శాతం వడ్డీతో చెల్లించాలి.

కిసాన్ క్రెడిట్ కార్డుపై వడ్డీ రేటు 9 శాతం. రైతుల కోసం 2 శాతం సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఈ విధంగా, కిసాన్ క్రెడిట్ కార్డుపై వడ్డీ రేటు 7 శాతంగానే ఉంటుంది. కానీ రైతు 1 సంవత్సరంలోపు రుణాన్ని తిరిగి చెల్లిస్తే, అతనికి 3 శాతం రాయితీ లభిస్తుంది. ఈ విధంగా రుణంపై వడ్డీ రేటు 4 శాతం మాత్రమే ఉంటుంది. పశుసంవర్ధక, మత్స్య సంపద చేసే వారు వ్యవసాయ రుణం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news