అన్నదాతలకు గుడ్ న్యూస్.. 4 శాతం వడ్డీకే రుణాలు..!

-

రైతులు కి కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన రైతుల కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏటా రూ.6,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అలానే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌ను కూడా రైతుల కోసం కేంద్రం తీసుకు వచ్చింది.

farmers

ఈ స్కీమ్ ద్వారా రైతులు కి కేవలం 4 శాతం వార్షిక వడ్డీ కి వ్యవసాయ రుణాలు వస్తాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. వ్యవసాయం మొదలైన వాటి కోసం రైతులకు లోన్స్ ఇస్తాయి బ్యాంకులు. రూ.3 లక్షల వరకు లోన్ రైతులకి వస్తుంది. ఈ పథకం తో ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుంది. రైతులు మరణించినా, శాశ్వత వైకల్యానికి గురైనా రూ.50,000 వరకు బీమా కవరేజీ వస్తుంది.

అర్హత ఉంటే స్మార్ట్ కార్డ్, డెబిట్ కార్డ్‌ కూడా లభిస్తాయి. ఈ డబ్బులు రుణాలను ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం వాడచ్చు. రూ.1.60 లక్షల వరకు లోన్ కి మాత్రం ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. ఇక ఎంత వడ్డీ కి వస్తోందనేది చూస్తే… 7 శాతం వార్షిక వడ్డీ నుంచి లోన్స్ వస్తాయి. మీరు కనుక సకాలంలో లోన్ చెల్లిస్తే 3 శాతం వరకు వడ్డీ మినహాయింపు పొందొచ్చు. రైతులు 4 శాతం మాత్రమే చెల్లించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23, 2023-24 సంవత్సరాలకు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద వడ్డీ రాయితీ ఇస్తోంది. రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news