స్పామ్ కాల్స్,మెసేజ్ లను ఎలా బ్లాక్ చెయ్యాలంటే?

-

పొద్దున్నే మనల్ని స్పామ్ కాల్స్ నిద్ర లేపుతాయి అనడంలో సందేహం లేదు..అంతగా ఆ కాల్స్, మెసేజ్ లు ఇబ్బంది పెడతాయి.కాల్స్‌ను బ్లాక్ చేయడం కోసం ట్రాయ్‌ ఎన్‌సీపీఆర్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది.తెలియని నంబర్ల నుంచి పదే పదే కాల్స్ వస్తుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. దాంతో కొన్నిసార్లు ముఖ్యమైన కాల్స్‌ను కూడా స్పామ్ కాల్‌గా పొరబడే అవకాశం ఉంది. అందుకని వాటిని బ్లాక్ చేయడం ఎలా? అని ఆలోచిస్తుంటారు. అయితే అన్ని నంబర్లను బ్లాక్ చేయడం కుదరదు. అయితే.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) యూజర్లకు స్పామ్ లేదా మార్కెటింగ్ కాల్స్‌ను బ్లాక్ చేసే అశకాశం కల్పిస్తోంది. నెట్‌వర్క్ ఏదైనా స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టొచ్చు..ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిని పూర్తిగా కనిపించకుండా చెయ్యడానికి ట్రాయ్‌ ప్రత్యేకంగా నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్‌ (ఎన్‌సీపీఆర్) అనే వ్యవస్థను తీసుకొచ్చింది. దాంతో, జియో, ఎయిర్‌టెల్, వీఐతో పాటు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ యూజర్లు కూడా తమ ఫోన్‌లో డు నాట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ) సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు..

ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..

మెసేజ్ ఫోల్డర్‌లోకి వెళ్లి.. START అని ఇంగ్లీష్‌లో టైప్ చేయాలి. ఆ పదాన్ని 1909 నంబర్‌కు మెసేజ్ ను సెండ్ చెయ్యాలి. యూజర్లు వాడుతున్న నెట్‌వర్క్ నుంచి వెంటనే మెసేజ్ వస్తుంది. అందులో బ్యాంక్‌, హోటళ్లు..ఇలా కేటగిరీల వారీగా వివరాలు, వాటికి ఒక కోడ్ ఉంటుంది. వాటిలో స్పామ్ కాల్స్ బ్లాక్ చేయాలి అనుకున్న కేటగిరీ కోడ్ టైప్ చేసి రిప్లయ్ ఇవ్వాలి. వెంటనే మీ రిక్వెస్ట్‌ను స్వీకరించినట్టు నెట్‌వర్క్ నుంచి మెసేజ్ వస్తుంది. 24 గంటల్లో డు నాట్ డిస్టర్బ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. దాంతో, థర్డ్‌పార్టీ కమర్షియల్ కాల్స్ మాత్రమే బ్లాక్ అవుతాయి. బ్యాంకులు, ఆన్‌లైన్ పోర్టల్స్, సర్వీస్‌కు సంబంధించిన మెసేజ్‌లు బ్లాక్ కావు. నెట్‌వర్క్ వారీగా డూ నాట్ డిస్టర్బ్ మోడ్‌ని ఎలా యాక్టివేషన్ చెయ్యాలో చుద్దాము..

*. ఎయిర్‌టెల్ అఫీషియల్ సైట్‌లో (airtel.in/airtel-dnd)కి వెళ్లాలి. ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి, బ్లాక్ చేయాలనుకున్న కేటగిరీని సెలక్ట్ చేసుకోవాలి.

*. అదే వొడా, ఐడియా అయితే discover.vodafone.in/dndలోకి వెళ్లాలి. ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, పేరు ఎంటర్ చేయాలి. బ్లాక్ చేయాలనుకున్న కేటగిరీని ఎంపిక చేసుకోవాలి.

*. ఇక జియోలో..మై జియో యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సర్వీస్ సెట్టింగ్స్‌లో డు నాట్ డిస్టర్బ్ ఆప్షన్ ఉంటుంది. అందులో స్పామ్ కాల్స్, మెసేజ్‌లను బ్లాక్ చేయాలనుకున్న కేటగిరీ చూజ్ చేసుకోవాలి.

*. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌..1909 నంబర్‌కు start dnd అని మెసేజ్ చేయాలి. వెంటనే కేటగిరీల వివరాలు వస్తాయి. అందులో బ్లాక్ చేయాలనుకున్న కేటగిరీని సెలక్ట్ చేసుకోవాలి. వాయిస్‌కాల్, మెసేజ్‌లను కూడా పూర్తిగా బ్లాక్ చెయొచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news