IRCTCలో టికెట్లు బుక్ చేశాకా..ఒకరికి మాత్రమే ఎలా క్యాన్సిల్‌ చేయాలో తెలుసా..?

-

ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ట్రైన్‌ జర్నీ చేసేప్పుడు అన్నీ టికెట్లు కలిపి ఒకటేసారి బుక్‌ చేసుకుంటాం..IRCTC ద్వారానే చాలామంది ఆన్‌లైన్‌లో టికెట్స్‌ బుక్‌ చేస్తారు. అయితే కొన్నిసార్లు ఒకరిద్దరు ప్రయాణం క్యాన్సిల్‌ చేసుకుంటారు. అప్పుడు టికెట్స్‌ క్యాన్సిల్‌ చేస్తే..మొత్తం అన్ని క్యాన్సిల్‌ అయిపోతాయి. ఎలా సింగిల్‌ టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకోవాలో తెలియక మనం అలానే వదిలేస్తాం.. కానీ గ్రూప్‌ ఆఫ్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ అందులోంచి సింగిల్‌ టికెట్ క్యాన్సిల్‌ చేసుకోవచ్చు. అది ఎలా అంటే..

IRCTC
IRCTC

మీరు 3 నుంచి 4 సీట్ల బుకింగ్ చేసి ఒకటి లేదా రెండు సీట్లకు రద్దు చేసుకోవచ్చు. ఈ-టికెట్లను పాక్షికంగా రద్దు చేయాలంటే.. IRCTC ఈ-టికెటింగ్ వెబ్‌సైట్లో లాగిన్ అవ్వాలి. IRCTC వెబ్‌సైట్ చార్ట్ రెడీ అయ్యే లోగా బుకింగ్ చేసుకున్న రైలు టికెట్ రద్దు చేసే సదుపాయాన్ని అందిస్తుంది. రైల్వే టికెట్ కౌంటర్లలో ఈ-టికెట్ల రద్దుకు మాత్రం అనుమతి లేదు. మీరు మీ టికెట్‌ను రద్దు చేయాలనుకుంటే.. కేవలం సింగిల్ వ్యక్తి IRCTC ఈ-టికెట్ రిజర్వేషన్‌ను రద్దు చేసుకోవచ్చు.

లాగిన్ స్క్రీన్‌పై సరైన వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా IRCTC ఈ-టికెటింగ్ వెబ్‌సైట్‌ను తెరిచి లాగిన్ చేయండి.
నిర్దిష్ట ఈ-టికెట్‌ను రద్దు చేసేందుకు ‘My Transactions’కి వెళ్లండి.
ఇప్పుడు మై అకౌంట్ మెను కింద ‘Booked Ticket History’ లింక్‌పై క్లిక్ చేయండి.
మీరు బుక్ చేసిన టికెట్ల సెక్షన్‌లో చూస్తారు.
ఇప్పుడు Cancel చేయాల్సిన టికెట్లను ఎంచుకుని, ‘Cancel Ticket‘పై క్లిక్ చేయండి.
టికెట్ Cancel చేయాల్సిన ప్రయాణీకుల పేరును ఎంచుకోవడం ద్వారా ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.
ఇప్పుడు ప్రయాణీకుల పేరు ముందు ఉన్న చెక్ బాక్స్‌ను ఎంచుకోవాలి. “Cancel Ticket” బటన్‌పై క్లిక్ చేయండి.
Cancel నిర్ధారించడానికి కన్ఫర్మేషన్ పాప్‌‌అప్‌పై Ok క్లిక్ చేయండి.
Cancel సక్సెస్ అయిన తర్వాత మీరు ఎంచుకున్న టికెట్ Cancel అవుతుంది.
ఆ టికెట్ నగదు మీ అకౌంట్లో రీఫండ్ అవుతుంది.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌లో Ticket Cancel‌కు సంబంధించిన నిర్ధారించేందుకు SMS, ఈ-మెయిల్‌ను కూడా వస్తుంది..

ఒక టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు ఇతర ప్రయాణీకులతో కూడిన ERS అనే ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్ లేటెస్ట్ ప్రింటౌట్‌ని తీసుకోవాలి. ఎందుకంటే.. క్యాన్సిల్ చేసిన టికెట్ లేకుండా మిగతా టికెట్లతో ప్రింట్ తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news