రూ.500 నోట్ల రద్దు పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన?

-

ఇటీవలే కేంద్రం రూ.2000 వేల రూపాయల నోటును రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు రూ. 500 నోట్ ను కూడా రద్దు చెయ్యనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అందుకు కారణం నోట్ల కొరత, నకిలీ నోట్లు.. దీనివల్ల ఆర్బీఐ కు పెద్ద సమస్యగా మారింది. రెండు వేల నోట్లను మార్చుకొని అందరు ఈ నోట్లను తీసుకుంటున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రోజూ వేల కోట్ల రూపాయల రూ.500 నోట్లు మాయమవుతున్నాయి. ఎప్పుడైతే రూ.2000 నోటును RBI ఉపసంహరించిందో. వెంటనే రూ.500 నోట్లకు డిమాండ్.. 4 రెట్లు పెరిగింది. దాంతో.. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని.. నకిలీ నోట్ల మాయగాళ్లు రెడీ అయిపోయారు..


విచ్చలవిడిగా రూ.500 నోట్లను నకిలీవి ముద్రిస్తూ… దేశవ్యాప్తంగా మార్పిడి చేస్తున్నారు..ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన నోట్ల కంటే… 20 శాతం ఎక్కువగా రూ.500 నోట్లు చెలామణీలో ఉన్నాయి. ఆ ఎక్కువగా ఉన్నవన్నీ నకిలీ నోట్లే. దీని వల్ల భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ పట్ల నమ్మకం సడలిపోతుంది.. అందుకే ఈ నోట్లను కూడా రద్దు చేస్తే ఇక సమస్య ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు..

కాగా, త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ రూ.500 నోటును కూడా ఉపసంహరించుకుంటుంది అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినా… ఆర్థిక నిపుణుల్లో చాలా మంది రద్దు చేసేయడమే బెటర్ అంటున్నారు. ఇకపోతే ఇప్పటికే రూ.2 వేల నోట్లు 20 శాతం మాత్రమే వెనక్కి వచ్చాయి.. నోట్లను ప్రజలు బ్యాంకుల్లో ఇవ్వకుండా చెలామణీ చేస్తున్నారు. పెట్రోల్ బంకులు, షాపింగ్ మాళ్లలో ఇస్తున్నారు.. దాంతో బ్యాంకుకు రావడానికి ఆలస్యం పడుతుంది.. ఇక ఈ నోట్లు కూడా రద్దు అయితే పరిస్థితి ఏంటో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news