బ్యాంకు లాకర్ తాళాన్ని పోగొట్టుకున్నారు..? అయితే వెంటనే ఇలా చెయ్యాల్సిందే…!

-

చాలా మంది లాకర్లలో బంగారం, విలువైన డాక్యుమెంట్లని దాచుకుంటూ ఉంటారు. ఇలా దాచుకోవడం వలన బ్యాంకు లాకర్ లో సురక్షితంగా ఉంటాయి. అయితే బ్యాంక్ నౌకరి తీసుకున్న తర్వాత ఒక తాళంని అకౌంట్ హోల్డర్ కి ఇస్తారు. మరొక తాళం బ్యాంకు వద్ద ఉంటుంది. అయితే ఎప్పుడైనా బ్యాంకు లాకర్ తాళం పోతే ఏం చేయాలి..? అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

bank locker

అనుకోని పరిస్థితుల్లో ఎకౌంట్ హోల్డర్ వద్ద ఉన్న తాళం పోతే బ్యాంక్ మేనేజర్ కి ముందు ఒక లెటర్ రాయాలి. అప్పుడు మేనేజర్ లాకర్ మరొకరు తెరవకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. లాకర్ తాళం పోయినట్లు బ్యాంకు కి సమాచారం ఇస్తే లాకర్ తెరవడానికి శిక్షణ పొందిన వారు బ్యాంకు కార్యాలయానికి వచ్చి బ్యాంకు అధికారి, లాకర్ కలిగిన వ్యక్తి సమక్షంలో లాకర్ ని ఓపెన్ చేస్తారు. ఈ వ్యక్తి అందుబాటులో లేకుంటే బ్యాంకు అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.

ఆ తర్వాత ఆ లోకంలో ఉండే పత్రాలని లేదా నగలని అకౌంట్ హోల్డర్ కి ఇస్తారు. అయితే ఈ ప్రాసెస్ చేయడానికి మూడు వేల వరకు ఖర్చు అవుతుంది. లేదు అంటే ప్రాసెస్ ని బట్టి చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. చిన్న లాకర్ కి రిప్లేస్మెంట్ చార్జీలు తక్కువగా ఉంటాయి.

అదే పెద్ద లాకర్లకి అయితే చార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఏదైనా బ్యాంకు లాకర్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని బ్యాంకులు అయితే లాకర్ చార్జెస్ మాత్రమే కాకుండా బ్రేకింగ్ చార్జీలు కూడా అడ్వాన్స్ గా తీసుకుంటారు. లాకర్ ను బ్రేక్ చేయాల్సిన అవసరం కోసం ఈ ముందస్తు చార్జీలు వసూలు చేస్తారు. అవసరమైతే అదనపు చార్జీలు కూడా చెల్లించాలి. ఏది ఏమైనా తాళాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోండి లేదు అంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news