మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ : నెలకు రూ.4,950 పొందొచ్చు..!

మీరు మీ డబ్బుని ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక పోస్ట్ ఆఫీసులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ గురించి తెలుసుకోండి. పోస్ట్ ఆఫీసులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో చేరితే ప్రతీ నెలా మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. అయితే మరి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే… ప్రతీ పోస్ట్ ఆఫీసులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఉంటుంది. దీనితో ప్రతీ నెలా కూడా రూ.4,950 వరకు మీరు డబ్బులు పొందే అవకాశం వుంది. ఈ స్కీమ్ లో రూ.1,000 నుంచి డిపాజిట్ చేయొచ్చు. సింగిల్ అకౌంట్‌కు గరిష్టంగా రూ.4,50,000, జాయింట్ అకౌంట్‌లో రూ.9,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇక ఎవరు అర్హులు అనేది చూస్తే..

Postoffice
Postoffice

10 ఏళ్ల వయస్సు దాటినవారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. మైనర్లు అకౌంట్ ఓపెన్ చేస్తే గార్డియన్ ఉంటే సరిపోతుంది. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ కూడా తెరవొచ్చు. ప్రస్తుతం 6.6 శాతం వడ్డీ లభిస్తోంది. సింగిల్ అకౌంట్‌లో రూ.4,50,000 డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.29,700 వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.2,475 మీ అకౌంట్‌లో జమ అవుతుంది. అదే కనుక జాయింట్ అకౌంట్ అయితే రూ.9,00,000 డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.59,400 వడ్డీ వస్తుంది.

నెలకు రూ.4,950 మీ ఖాతాలో పడుతుంది. అయితే ఇందులో డిపాజిట్ చేసిన ఏడాది వరకు డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. ఏడాది నుంచి 3 ఏళ్ల మధ్య అకౌంట్ క్లోజ్ చేస్తే ప్రిన్సిపాల్ అమౌంట్‌లో 2 శాతం, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల మధ్య అకౌంట్ క్లోజ్ చేస్తే 1 శాతం తగ్గించి మిగిలిన మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది.