పోస్టాఫీస్ స్కీమ్స్: ఈ స్కీమ్ లో చేరితే ప్రతి నెలా రూ.2 వేలు!

-

పోస్టాఫీస్ post office చాల రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన చాలా ప్రయోజనాలు పొందొచ్చు. పైగా దీనిలో డబ్బులు పెట్టడం వల్ల  ఏ రిస్క్ కూడా ఉండదు. మీ స్కీమ్ ని బట్టి మీకు వచ్చే రాబడి ఆధార పడి ఉంటుంది. ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

పోస్టాఫీస్/ post office
పోస్టాఫీస్/ post office

మీరు ఎంచుకునే స్కీమ్ ద్వారా మీ రాబడి ఉంటుంది. ఇది ఇలా ఉంటే పోస్టాఫీస్ అందించే పథకాల్లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ MIS కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తాయి.

అయితే ఈ స్కీమ్ లో ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. తర్వాత ప్రతి నెలా ఈ డబ్బుపై వడ్డీ వస్తూనే ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్ లో పదేళ్ల వయసు దాటిన పిల్లలని కూడా చేర్చచ్చు.

స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు. మీరు రూ.2 లక్షలు డిపాజిట్ చేసి ఈ పథకంలో చేరితే మీకు నెలకు రూ.1100 వస్తాయి. ఐదేళ్లలో రూ.66 వేల వరకు వడ్డీ రూపంలో లభిస్తాయి. ఒకవేళ రూ.3.5 లక్షలు డిపాజిట్ చేసారంటే నెలకు దాదాపు రూ.2 వేలు వస్తాయి. ఇలా ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news