డబ్బులని ఇన్వెస్ట్ చేయాలంటే బెస్ట్ స్కీమ్స్ ఇవే..!

స్కీమ్స్ లో చాలా రకాలు వున్నాయి. అయితే ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన మంచి లాభాలని పొందొచ్చు. అయితే ఈరోజు కొన్ని రకాల స్కీమ్స్ గురించి చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే పూర్తిగా చూద్దాం.  (MIS) అనేది ఒక స్కీమ్. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే నెలవారీ ఖర్చులకు హెల్ప్ అవుతుంది. దీని ద్వారా సంవత్సరానికి 7.8 శాతం వడ్డీ వస్తుంది. వెయ్యి నుండి కూడా ఇన్వెస్ట్ చెయ్యచ్చు.

money
money

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కూడా మంచి స్కీమ్. ఏడాదికి 7.4 శాతం వడ్డీ వస్తుంది. రూ.1000తో ఈ పథకం స్టార్ట్ చెయ్యచ్చు. రూ.15 లక్షల దాకా ఈ స్కీములో చేరచ్చు. అలానే పోస్టాఫీసులో ఓ రికరింగ్ డిపాజిట్ తెరవవచ్చు. ఇందుకు కనీసం నెలకు రూ.100 మాత్రమే జమ చెయ్యచ్చు. ఏడాదికి 5.6 శాతం వడ్డీ వస్తోంది.

అలానే పోస్టాఫీసులో టైమ్ డిపాజిట్ కూడా బాగుటుంది. 1 సంవత్సరం నుంచి 5 ఏళ్ల వరకూ తెరవవచ్చు. ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చు. వడ్డీ రేటు ఏడాదికి 5.5 శాతం నుంచి 7.8 శాతం దాకా ఉంటుంది.

న్యూ జీవన్ శాంతి డిఫెర్డ్ యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. నెలవారీ లేదా 3 నెలలు లేదా 6 నెలలు లేదా సంవత్సరానికి ఓసారి డబ్బు చెల్లించవచ్చు. దీనికి అయితే ఏడాదికి కనీసం రూ.12,000 చెల్లించాలి.

అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి డిపాజిట్ చేయచ్చు. 6.6 శాతం వడ్డీ లభిస్తోంది. అదే విధంగా చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ కూడా వుంది. ఇన్సూరెన్స్ అనేది 0 నుంచి 12 ఏళ్ల పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. కనీసం రూ.10,000 ఇన్సూరెన్స్ చేయాలి.