అదిరే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో నెల‌కు రూ.4,950 ఆదాయం..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యాలి. అయితే ఎన్నో రకాల స్కీమ్స్ ని పోస్ట్ ఆఫీస్ కూడా ఇస్తోంది. వాటిలో డబ్బులను పొదుపు చేస్తే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పైగా ఈ స్కీమ్స్ లో డబ్బులు ఉంటే మంచిగా లాభాలు వస్తాయి. తక్కువ పొదుపు చేయాలని అనుకునే వారికి ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

money
money

అలానే ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన ప్రతీ నెలా కూడా చక్కగా డబ్బులు వస్తాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే వ‌డ్డీ కూడా అధికంగా ల‌భిస్తుంది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే వారికి పోస్టాఫీస్ మ‌నీ సేవింగ్ స్కీమ్స్ బాగా ఉపయోగ పడతాయి.

పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో స్మాల్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో డ‌బ్బును క‌నీసం రూ.1000తో పొదుపు చెయ్యచ్చు. ఈ స్కీమ్ లో ఎవరైనా వెయ్యి నుండి ఇన్వెస్ట్ చెయ్యచ్చు. గ‌రిష్టంగా రూ.4.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఒక వ్య‌క్తి పొదుపు చేయ‌వ‌చ్చు.

జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ స్కీమ్‌లో గ‌రిష్టంగా రూ.9 ల‌క్ష‌లు పొదుపు చెయ్యచ్చు. ఏడాదికి ఈ స్కీమ్ నుండి 6.6 శాతం వ‌డ్డీ ని ఇస్తారు. పోస్టాఫీస్‌లోనే సేవింగ్స్ ఖాతా ఉంటే ఈ వ‌డ్డీని డైరెక్ట్ గా అకౌంట్ వేస్తారు. సింగిల్ లేదా జాయింట్ ఖాతాల‌ను ఓపెన్ చెయ్యచ్చు. అలానే 10 ఏళ్లు పైబ‌డిన వారు ఈ ప‌థ‌కంలో చేరచ్చు. రూ.9 ల‌క్ష‌లు పొదుపు చేస్తే ఏడాదికి రూ.59,400 వ‌స్తాయి. అంటే నెల‌కు రూ.4,950 వ‌స్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news