రేషన్‌ కార్డ్, ఇల్లు లేనివారికి కేంద్రం గుడ్ న్యూస్..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా చాలా ముఖ్యమైనవి. రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులను ఇస్తాయి. అయితే చాలా మందికి రేషన్ కార్డ్స్ ఉండకపోవచ్చు కూడా. అయితే ఇలా కార్డ్స్ లేని వారికి సబ్సిడీ రేటుకే ఆహార ధాన్యాలు లభించవు. అయితే ఇప్పుడు సరికొత్తగా రేషన్ కార్డు లేని, ఇల్లు లేని పేదలకు కూడా సబ్సిడీ కింద ఆహార ధాన్యాలు ఇవ్వడానికి డేటాను సేకరిస్తోంది.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరకే ఆహార ధాన్యాలు అందేబాటులో ఉంచింది. దీని ద్వారా 81 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోంది. అలానే కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఉచితంగానే బియ్యంని కేంద్రం అందిస్తోంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన కింద దీనిని ఇస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇల్లు లేని వారు నిరాశ్రయులు, సరైన ఐడెంటిటీ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్ లేని వారు సబ్సిడీ రేటు ఆహార ధాన్యాలు లేదా ఉచిత బియ్యం ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. అయితే వీరికి రిలీఫ్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఇల్లు లేని నిరుపేదలు అందరి వివరాలు సేకరించి కొత్త వ్యవస్థని తీసుకురావాలని అనుకుంటోంది. ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం కింద దేశంలో 81 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా.. రాష్ట్రాలు మాత్రం 79.71 కోట్ల మందికి రేషన్ కార్డులను జారీ చేసారు మిగిలిన 1.6 కోట్ల మందిని కూడా ఎన్ఎఫ్ఎస్ఏ కిందకు తీసుకురావాలని కేంద్రం రాష్ట్రాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news