హైదరాబాద్ నుంచి కేరళ టూర్.. రూ.12,000 లోపే..!

మీరు కేరళ చూసి వచ్చేయాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. IRCTC వివిధ రకాల ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల ద్వారా చాలా మంది టూర్లకు వెళ్లి వస్తున్నారు. కేరళ టూర్ ని తీసుకు వచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా మీరు ఈ ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే..

కేరళ హిల్స్ అండ్ వాటర్స్ అనే పేరు తో ఈ ప్యాకేజి ని తీసుకు వచ్చింది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మున్నార్, అలెప్పీ లోని పర్యాటక ప్రాంతాలు ఈ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. పర్యాటకుల్ని రైలులో తీసుకెళ్లి అన్నింటినీ చూపిస్తారు. గ్రూప్ బుకింగ్ చేసేవారికి రూ.12,000 లోపే టూర్ ప్యాకేజీ.

మంగళవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి రెండో రోజు మీరు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకుళం టౌన్ రీచ్ అవుతారు. అక్కడ నుండి మున్నార్ తీసుకెళ్తారు. సాయంత్రం మున్నార్‌లో ఉండి.. అక్కడే స్టే చెయ్యాలి. మూడో రోజు ఎరవికుళం నేషనల్ పార్క్, టీ మ్యూజియం చూడచ్చు.

అలానే మెట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్ ని కూడా చూడచ్చు. నాలుగో రోజు అలెప్పీ స్టార్ట్ అవ్వాలి. అక్కడ బ్యాక్‌వాటర్స్ చూడచ్చు. రాత్రికి అలెప్పీలో స్టే చెయ్యాలి. ఐదో రోజు ఎర్నాకుళం బయల్దేరాలి. ఎర్నాకుళంలో ఉదయం 11.20 గంటలకు స్టార్ట్ అయితే ఆరో రోజు సికింద్రాబాద్ రీచ్ అవుతారు. టూర్ ఎండ్ అవుతుంది. పూర్తి వివరాలని IRCTC వెబ్ సైట్ లో చూడచ్చు.

 

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?