ఆంధ్రాఊటీ ‘హార్సిలీ హిల్స్ ‘ గురించి మరిన్ని విషయాలు..

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో టూరిజమ్ ప్లేసులు ఉన్నాయి. అందులో ఒకటి ‘హార్సిలీ హిల్స్ ‘..ప్రకృతి అందాలను తనలో దాచుకున్న అందమైన ప్రదేశం..ప్రకృతి అందాలను వీక్షించాలనుకునేవారికి హార్సిలీ హిల్స్‌ చూడచక్కని ప్రదేశం. ఎటుచూసినా కొండలుకోనల సోయగాలు, పొడవాటి నీలగిరి జాతుల వృక్షాలు, ఆ మధ్యన తారాడే సెలయేటి జలపాతాలు.. ఇలా ప్రకృతి సమేత సౌందర్యం హార్సిలీహిల్స్‌ సొంతం. అంతేకాదు, ఇక్కడి వైవిద్యభరితమైన వాతావరణం పర్యాటకులకు ఓ సరికొత్త అనుభూతి…

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో మదనపల్లె హార్సిలీ హిల్స్. ఆంధ్రా ఊటీ అని దీనికి పేరు. ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా అంటారు..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా ఎత్తైన ప్రదేశం హార్సిలీ హిల్స్ లోనే ఉంది.హార్సిలీ హిల్స్ కు వెళ్ళే కొండదారి ఎంతో అందంగా ఉంటుంది. రెండు వైపులా నీలగిరి వంటి అనేక జాతుల చెట్లతో కళ్ళకింపుగా ఉంటుంది. జింకలు, చిరుతపులుల వంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి..

ఈ రిసార్ట్ కు బెంగుళూర్, హైదరాబాద్ మరియు తిరుపతి వంటి దక్షిణ ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఏప్రిల్ మరియు మే నెలల్లో వేడి పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సుందరమైన పర్వతం వేడి వాతావరణం ఉపశమనం కలిగిస్తుంది..ఒక చల్లని అనుభూతిని కలిగిస్తుంది.హార్సిలీ హిల్స్ కు వెళ్ళే కొండదారి ఎంతో అందంగా ఉంటుంది. రెండు వైపులా నీలగిరి (యూకలిప్టస్) వంటి అనేక జాతుల చెట్లతో కళ్ళకింపుగా ఉంటుంది. జింకలు, చిరుతపులుల వంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి..
ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఇక్కడి ప్రత్యేకతలు..

ఇక్కడ చూడదగిన ప్రదేశాలు..142 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ చెట్టు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. అంతేకాకుండా జూ పార్క్, గవర్నర్ బంగ్లా, జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషివ్యాలీ విద్యాలయము ఉంది..ఇవి పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి.మదనపల్లె పట్టణం సమీపంలో ఉన్న చాలా ప్రజాదరణ పొందిన వేసవి హిల్ రిసార్ట్ ఇది..ఏప్రిల్ మరియు మే నెలల్లో ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు.ఆ సమయంలో అక్కడి ప్రాంతం చల్లగా ఉంటుంది.

ఒకప్పుడు ఈ కొండను ఏనుగు మల్లమ్మ కొండ అని పిలుస్తారు.. ఒకప్పుడు మల్లమ్మ ఇక్కడ ఏనుగులను కాచిందట అందుకే ఏనుగు మల్లమ్మ అనే వచ్చింది.అయితే బ్రిటిష్ అధికారి, డబ్ల్యూడి హార్స్లే వేసవి విడిది కోసం వచ్చిన ఒక బ్రిటిష్ అధికారి డబ్ల్యూడి హార్స్లే ఈ హిల్ స్టేషన్ లో రెండు ఇళ్ళు, కరాచీ రూమ్ మరియు పాల బంగళా నిర్మించడం ద్వారా అయన పేరుతో హార్స్లి హిల్స్ అనే పేరు వచ్చింది..ఇకపోతే ఈ ప్రాంతంలో సినిమాలను కూడా తీస్తారు..

ఎలా చేరుకోవాలి?

హార్సిలీ హిల్స్ బెంగళూరు నుండి 160 కి.మీ., తిరుపతి నుండి 140 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1,314 మీ ఎత్తులో ఉంది. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడు నుండి మండు వేసవిలో 32 డిగ్రీల సెంటీ గ్రేడు వరకు ఉష్ణోగ్రత ఉంటుంది.కడప రాయచోటి నుంచి కూడా బస్సు మార్గం లో అక్కడకు చేరవచ్చు.. బస్సులు మదనపల్లె నుంచి ఎక్కువగా వెలతాయి..ఎప్పుడైనా అక్కడకు వెళితే మాత్రం హార్స్లి హిల్స్ ను సందర్షించండి..

Read more RELATED
Recommended to you

Latest news