Waterfalls : హైదరాబాద్ లో వీకెండ్ విహారానికి బెస్ట్ స్పాట్ ఇదే..

-

ఉరుకులు పరుగుల జీవితం.. వారమంతా తినడానికి కూడా తీరకలేనంత బిజీ షెడ్యూల్ తో అందరు యాంత్రికంగా తయారవుతున్నారు. కానీ వీకెండ్ వచ్చిందంటే మాత్రం రోబో జీవితాలకు గుడ్ బై చెప్పి హాయిగా జాలీగా గడపుతుంటారు. అయితే వీకెండ్ లో కొందరు ఇంట్లోనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే మరికొందరు మాత్రం సరదాగా బయటకు వెళ్లాలనుకుంటారు.

- Advertisement -

వీకెండ్ కి ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లాలన్నా.. ఫ్యామిలీతో కలిసి పిక్ నిక్ కు వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్లాలో అని ఆలోచిస్తున్నారా. మీరు హైదరాబాద్ వాసులే అయితే ఈ వర్షాకాలంలో మీరు జాలీగా వీకెండ్ ని గడపటానికి నగరానికి సమీపంలోనే ఓ సూపర్ పర్ ఫెక్ట్ వీకెండ్ స్పాట్ ఉంది. మరి అదేంటో తెలుసుకుందామా..

వర్షాకాలంతో పిక్ నిక్ స్పాట్ కి బెస్ట్ ఛాయిస్ జలపాతాలు. ఓవైపు పచ్చని ప్రకృతి..మరోవైపు జలపాతాల సవ్వడి.. ఇంకోవైపు పక్షుల కిలకిలరావాలు.. అనుకుంటేనే అదిరిపోతోంది కదా. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ కి వెళ్లాలంటే శంషాబాద్ దగ్గరలో ఉన్న నానాజీపూర్ వాటర్ ఫాల్స్. శంషాబాద్​ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది నానాజీపూర్ జలపాతం. తిమ్మాపూర్ర్ లో ఉన్న పాలమాకుల్ చెరువు నిండితే ఆ నీళ్లు హిమాయత్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్తాయి. ఆ మధ్యలో ఉన్న కొండరాళ్ల మీదుగా నీళ్లు జాలువారి నానాజీపూర్​ జలపాతంగా మారాయి.

ఈ వాటర్ ఫాల్‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో 17వ శ‌‌‌‌‌‌‌‌తాబ్దంలో కట్టిన అమ్మప‌‌‌‌‌‌‌‌ల్లి సీతా రామ‌‌‌‌‌‌‌‌చంద్ర స్వామి ఆల‌‌‌‌‌‌‌‌యం ఉంది. ఈ గుడిలో హనుమంతుడు ఉండడు. హ‌‌‌‌‌‌‌‌నుమంతుడు రాముడ్ని క‌‌‌‌‌‌‌‌లవడానికి ముందే అర‌‌‌‌‌‌‌‌ణ్యవాసంలో భాగంగా సీతారాములు ఇక్కడ అడుగుపెట్టారనీ.. అందుకే హ‌‌‌‌‌‌‌‌నుమంతుడు లేకుండానే ఈ గుడిని కట్టారని పురాణాల్లో ఉందని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో వేంగీని పాలించిన కల్యాణీ చాళుక్యులు కట్టించారు. ఈ ఆలయ గర్భగుడిలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఏకశిల మీద చెక్కారు. వేల ఏండ్ల నాటి బావి , తొంభై అడుగుల గాలి గోపురాన్ని ఇక్కడ చూడొచ్చు. ఫొటో షూటింగ్స్, సినిమా షూటింగులకు ఈ స్పాట్ చాలా ఫేమస్.

ఇంత అందమైన ప్రదేశానికి ఎలా వెళ్లాలంటే.. శంషాబాద్ నుంచి మల్కారం వెళ్లేటప్పుడు రాయన్నగూడకు ఎడమవైపు మళ్లితే నానాజీపూర్ వస్తుంది. శంషాబాద్ నుంచి చెర్లగూడ, పెద్దషాపూర్ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా వెళ్లొచ్చు. ఇంకెందుకు ఆలస్యం నానాజీపూర్ జలపాతంలో తడవండి.. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా, జాలీగా ఈ వీకెండ్ ని ఎంజాయ్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...