ఇకపై ట్రావెలింగ్ మరింత సురక్షితం.. కోవిడ్ టెస్ట్ ల్యాబ్ ఉన్న ఓడ వచ్చేస్తోంది..

-

కరోనా వచ్చిన తర్వాత ట్రావెలింగ్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అన్న అనుమానాల వల్ల ట్రావెలింగ్ చేయడం దాదాపుగా మానేసారు. ఈ నేపథ్యంలో ట్రావెలింగ్ సంస్థలు ప్రయాణీకుల భద్రత నిమిత్తం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కోవిడ్ టెస్ట్ ల్యాబ్ కలిగి ఉన్న ఓడ సిద్ధం అవుతోంది. ప్రపంచంలోనే మొదటి కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉన్న ఓడగా వైకింగ్ స్టార్ క్రూజ్ రికార్డు సృష్టించనుంది.

ఈ ఓడ మొత్తం 27దేశాలు తిరుగుతుంది. 56ఓడరేవుల్లో ఆగుతుంది. అందువల్ల ప్రయాణికుల భద్రత కోసం ఈ ఏర్పాటు చేసింది. ఇందులో మొత్తం 930ప్రయాణీకులు ప్రయాణించవచ్చట. 2021డిసెంబరు వరకు ఈ ఓడ సముద్ర ప్రయాణానికి రెడీ అవనుందట. అప్పటి వరకి కరోనా వ్యాక్సిన్ వచ్చే వీలున్నందున్న ప్రయాణం మరింత సురక్షితంగా మారనుంది. మొత్తానికి కరోనా వల్ల ట్రావెలింగ్ లో చాలా మార్పులు రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news