ఎప్పుడు కరోనా పేషంట్స్ హాస్పిటల్ లో ఎడ్మిట్ అవ్వాలనేది వాక్ టెస్ట్ తో తెలుసుకోండి..!

చాలా మంది కరోనా బారిన పడి పోతున్నారు. అయితే covid-19 పేషంట్స్ హాస్పిటల్ లో ఎడ్మిట్ అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. పేషంట్లని కంగారు పడొద్దు అంటున్నారు డాక్టర్లు. ఒకవేళ RT-PCR టెస్ట్ లో పాజిటివ్ వస్తే వెంటనే ఆసుపత్రి లో అడ్మిట్ అవ్వక్కర్లేదు. ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగానే ఉంటుందని డాక్టర్లు అంటున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, Dr CS Pramesh, director, Tata Memorial Hospital సలహాలతో వెల్లడించింది. మంచి పోషకాలతో వున్నా ఆహరం తో పాటు ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం, యోగా, ప్రాణాయామం చేయడం మంచిది అన్నారు.

అలానే జ్వరం ఎంత ఉందని, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేయించుకోవాలి అని అంటున్నారు. అయితే మీ ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఆరు నిమిషాల పాటు వాక్ టెస్ట్ చేయాలని అంటున్నారు.

ఐసోలేషన్ రూమ్ లో వుంది వాక్ టెస్ట్ చేయడంవల్ల తెలుస్తుందని చెప్పారు. కనీసం రెండు నుంచి మూడు సార్లు ప్రతిరోజూ ఈ వాక్ టెస్ట్ చేయడం మంచిదని అన్నారు.

ఒకవేళ పరిస్థితి ఇలా ఉంటే అప్పుడు ఎడ్మిట్ అవ్వడం అవసరం:

94 శాతం కంటే ఆక్సి మీటర్ లో తక్కువ చూపించినప్పుడు.
ఆరు నిమిషాల పాటు నడిచిన తర్వాత నాలుగు శాతం లేదా అంతకంటే ఎక్కువ ఫ్లక్ట్యుయేషన్స్ ఉన్నప్పుడు… ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం మంచిదన్నారు. ఒకవేళ రీడింగ్ సరిగ్గా ఉంటే అప్పుడు హాస్పిటల్ లో అడ్మిషన్ అవ్వక్కర్లేదు అన్నారు. అదే విధంగా పేషెంట్ కి జ్వరం తప్ప మరి ఏ లక్షణాలు లేనప్పుడు పారాసెటమాల్ వాడితే సరిపోతుంది అన్నారు.