అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక విషయాల్లో సీఎం జగన్ సర్కార్ కి కోర్టుల్లో చుక్కెదురైతున్న విషయం తెలిసిందే. హైకోర్టు, సుప్రీం కోర్టు ఇలా రెండిట్లో జగన్ సర్కార్ కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవద్దని సున్నిత వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శల వర్షం కురిపించారు.
ఒకే విషయంలో ఇంకెన్ని సార్లు కోర్టుతో మొట్టికాయలు తింటారని ఆయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేశ్ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తప్పును సరిచేసుకోవాలని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
ఒకే విషయంలో పదే పదే ఇంకెన్ని సార్లు కోర్టుతో మొట్టికాయలు తింటారు ?
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ గారి కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని స్వాగతిస్తున్నాము.రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తప్పును సరిచేసుకుని రాజ్యాంగ వ్యవస్థలతో గౌరవంగా వ్యవహరించాలి. pic.twitter.com/C8dbjr5djV
— Kanna Lakshmi Narayana (@klnbjp) June 10, 2020