కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో విలయతాండవం చేస్తుంది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. . దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. కాగా, గత 24 గంటల వ్యవధిలో 443 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
51 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వారివిగా గుర్తించారు. మొత్తమ్మీద ఏపీలో ఇప్పటివరకు 9,372 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 83 మంది డిశ్చార్జి కాగా, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,435కి పెరిగింది. ప్రస్తుతం 4,826 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో 5 మరణాలు సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 111కి పెరిగింది. కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపూర్ జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.