తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసుల సంఖ్యతో ప్రజలు భయపడిపోతున్నారు. ఎంతో మంది అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అలాగే వారి దగ్గర పని చేసే సిబ్బంది, డ్రైవర్లు, గన్ మెన్లు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా.. వరంగల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల నిర్వహించిన సమీక్ష సమావేశంలో కరోనా కలకలం రేగింది.
ఆ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గన్మెన్లతోపాటు వ్యక్తిగత సిబ్బందికి ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కాగా వారంతా ఇప్పటికే పలు సమావేశాల్లో పాల్గొనడంతో ఆందోళన మొదలైంది. ఈ భేటీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారికి వైద్యారోగ్య శాఖ అధికారులు కరోనా టెస్టులు చేయగా.. వీరిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా అందరిలో ఆందోళన మొదలైంది.