జగన్ ధన దాహానికి ప్రజలు బలైపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రకాశంలో 20 మంది, కడపలో ముగ్గురు… నాటు సారా, శానిటైజర్ తాగి మృతి చెందటం బాధాకరమన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. జే ట్యాక్స్ వసూళ్ల కోసమే నూతన మద్యం పాలసీ తీసుకొచ్చారని దుయ్యబట్టారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల రక్తాన్ని తాగుతూ 25 వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా సీఎం మద్యం నిషేధం పేరుతో దందా చేయడం మాని… ప్రజల ప్రాణాలను కాపాడాలని హితవు పలికారు.
రాష్ట్రంలో 15 లక్షల మందికి కరోనా ఉందన్న టీడీపీ నేతలు.. రోడ్లపై ప్రజలు ప్రాణాలు వదులుతున్నా.. ముఖ్యమంత్రికి సొంత అజెండాలే ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ని రుజువు చేయలేక చేతులెత్తిసి మూడు రాజధానులు తెరమీదకు తీసుకొచ్చారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రం సర్వనాశనమైందని ఆరోపించారు.