భారత్ లో కరోనా కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి దాకా కరోనా కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా తగ్గాయని అనుకునే లోపే నిన్నటి నుండి మళ్ళీ విజ్రుంభణ మొదలయింది. తాజాగా నమోదయిన కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63 లక్ష వేలు దాటింది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటలలో 86,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63,12,585కు చేరింది. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,181 మంది మృతి చెందారు. దీంతో కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 98,678కు చేరింది. ఇక దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటిదాకా 52,73,202 మంది కోలుకోగా… వారిలో 78 శాతం మంది కేవలం పది రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఉన్నారు. 11 రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది వైరస్ను జయించారు. అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన మహారాష్ట్ర, ఏపీల్లో రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది.