బీజేపీలోకి తెలుగు సినీ నటి.. ఎప్పుడంటే..!

-

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం గా మారాలి అనుకుంటున్న బిజెపి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతోమంది నేతలను ఆకర్షిస్తుంది. అంతే కాకుండా ఎంతో మంది బిజెపి సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇటీవలే దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన సినీనటి కత్తి కార్తీక బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డితో మర్యాదపూర్వక భేటీ అయ్యారు కత్తి కార్తీక. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది. అయితే మరికొన్ని రోజుల్లో కత్తి కార్తీక బీజేపీ కండువా కప్పుకుని పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news