కమలం గూటికి చేరనున్న ఉత్తరాంధ్ర మాజీ మత్రి

-

మూడు దశాబ్దాల పాటు ఆపార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడ్డారు .. మూడు సార్లు ఎమ్మెల్యేగా , మంత్రిగా సైతం పనిచేసారు … సీనియర్ నేతనైన తనకి పార్టీలో కనీసం గౌరవం ఇవ్వడంలేదంటూ మదన పడుతున్నారు. పార్టీ కోసం కష్టపడుతుంటే కనీసం పట్టించుకునే నాదుడే లేరంటూ వాపోతున్నారు..విజయనగరం జిల్లాకి చెందిన టీడీపీ మాజీ మంత్రి పడాల అరుణ పార్టీ పై విరక్తితో పక్క చూపులు చూస్తున్నారట..బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లిన అరుణ త్వరలోనే మంది మార్భలంతో కమలం గూటికి చేరనున్నారట

ఉత్తరాంధ్రాలో టిడిపిలో కీలక మహిళానేతగా పేరోందిన వ్యక్తి పడాల అరుణ .. తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన ఆమెకు గజపతినగరంలో మంచి కేడర్ ఉంది . ఆలాంటి సీనియర్ నేత ఇప్పుడు పార్టీకి దూరమయ్యైందుకు సిద్దమౌతున్నారని సమాచారం .. 1987 లో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన పడాల అరుణ 1989,1994,2004 లలో మూడు సార్లు ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు ..చంద్ర బాబు క్యాబినేట్ లో శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేసారు ..ఇక 2004లో వైఎస్ హవాలో సైతం టిడిపి నుండి విజయం సాధించారు పడాల ఆరుణ .

2009లో ఓటమి పాలవ్వడంతో 2014 ఎన్నికల్లో ఆమెకు టిక్కట్ నిరాకరించింది టిడిపి అధిష్టానం .. గజపతినగరం అసెంబ్లీ టిక్కెట్ ని కోండపల్లి అప్పలనాయుకు కేటాయించింది .. అధినేత నిర్ణయాన్ని గౌరవించి పార్టీకోసం పనిచేసిన 2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ..ఆమెకు సరైన ప్రాదాన్యత దక్కలేదు .. జిల్లా టిడిపి నడిపించే అశోక్ గజపతి రాజు సైతం అరుణని ఆమడ దూరంలోనే ఉంచుతూ వస్తున్నారు ..అటు అధిష్టానం ,ఇటు జిల్లా పార్టీ పెద్దలు కనీసం ప్రాదాన్యత ఇవ్వకపోవడం .రాష్ట్ర కమీటిలలో సైతం చోటు కల్పించక పోవడంతో పడాల అరుణ అధిష్టానం పై గుర్రుగా ఉన్నారని సమాచారం.

మూడు దశాబ్దాలుగా పార్టీకోసం కష్టపడితే కనీసం పలకరించే నాదుడే లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారట .. పార్టీ ఘోర ఓటమి చవి చూసి , జిల్లా పార్టీ పెద్ద అశోక్ గజపతి రాజు సైతం ఓడిపోయినా .. వైఎస్ హవాలో సైతం గెలిచి పార్టీని నిలబెట్టానని , పార్టీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నా ..తనని కాదని వేరోకరికి అవకాశాలు ఇస్తూ తనని పక్కన పెడుతున్నారని కేడర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారట.ఇక ఇదే అధునుగా బీజేపి అగ్ర నేతలు సైతం పావులు కదుపుతున్నారని సమాచారం .. ఏపిలో పార్టీ బలో పేతం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బిజేపి పార్టీ పెద్దలు .. అరుణ పై ఫోకస్ చేసారని సమాచారం.

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న మాజీ ప్రభుత్వ విప్ గద్దె బాబూరావును ఇటీవల‌ బీజేపీలో చేర్చుకున్న బీజేపీ అదే చేత్తో మరో బలమైన సామాజికవర్గానికి చెందిన పడాల అరుణని సైతం పార్టీలో కి తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.ఇక అరుణ సైతం టిడిపి అధిష్టానం పై ఆగ్రహంతో ఉండటంతో బిజేపికి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ ఆమె కేడర్ గుసగుసలాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news