అమ్మాయి నో చెప్పినా ప్రేమిస్తుందని చెప్పడానికి ఇవి చాలు…

-

అమ్మాయిలు అస్సలు బయటపడరు. ప్రేమలో మరీనూ. అబ్బాయి చూసే చూపులని ముందే గ్రహించే అమ్మాయిలు, వాళ్ళు బయటపడే వరకుతమ నోటి నుండి మాటలు బయటపడనివ్వరు. అబ్బాయి చెప్పినా నాకలాంటి ఫీలింగ్ లేదని చెప్పేస్తారు. ఐతే అలా చెప్పినా కొందరు అబ్బాయిలు మాత్రం వెంటపడుతూనే ఉంటారు. ఒక అమ్మాయి ప్రేమిస్తుందని చెప్పడానికి కొన్ని గుర్తులు ఉంటాయి. మీ ముందు లేదని చెప్పినా నిజంగా ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుందని మీకనిపిస్తే కింద ఇవ్వబడ్డ చర్యలు అమ్మాయి చేస్తుందేమో గుర్తించండి.

మీ పక్క సీటులో కూర్చోవడానికి ఇష్టపడుతుంది. మీ పట్ల నిజంగా ప్రేమ లేకపోతే పక్క సీట్లో కూర్చోవడానికి ఆసక్తి చూపరు.

మీరు చెప్పే మాటలని చాలా శ్రద్ధగా వింటారు.

తన ఫ్రెండ్స్ కి మీ గురించి తెలియజేస్తారు. ప్రేమ విషయమే కాకుండా మీ గురించిన సమాచారం తెలియకుండానే వాళ్ల ఫ్రెండ్స్ తో పంచుకుంటారు.

ప్రేమకు నో అని చెప్పినా కూడా ఆమె వ్యక్తిగత విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడతారు. అలాగే మీ వ్యక్తిగత జీవితంలోని విషయాలపై చాలా ఆసక్తి ఉంటుంది. అడిగి మరీ మీ విషయాలను తెలుసుకోవాలని చూస్తారు.

మెసేజ్ చేసినా, కాల్ చేసినా ఖచ్చితంగా జవాబు ఇస్తారు.

మీకెలాంటి అమ్మాయి కావాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

మిమ్మల్ని చాలా ప్రశ్నలు వేస్తారు. మీ గురించి తెలుసుకోవాలన్న కోరికతో ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వేస్తారు.

మీరు చెప్పిన మాటలని గుర్తుంచుకుంటారు. వాటిని అప్పుడప్పుడు మీ ముందు గుర్తుచేస్తూ ఉంటారు.

ఐతే వీటిలో ఒక్క చర్య కూడా మీరు ప్రేమించిన అమ్మాయి చేయట్లేదంటే తప్పుకోవడం మంచిది. లేదంటే ఆమెకి మీ పట్ల ద్వేషం పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news