ఊరికే అలసిపోతున్నారా? ఐతే అది ఐరన్ లోపమే. ఐరన్ ని అందించే ఆయుర్వేద మార్గాలివే..

-

ఏ పని చేయకుండానే అలసిపోయినట్లుగా అనిపిస్తుందా? ఎక్కువ శ్రమ పడకుండానే నీరసంగా మారుతుందా? ఐతే అది ఐరన్ లోపమే. శరీరానికి కావాల్సిన ఐరన్ సరైన పాళ్లలో అందకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా కూడా పట్టించుకోకుండా పోతే దీర్ఘకాలంలో మరింత చేటు జరిగే అవకాశం ఉంది. అందుకే రక్తంలో ఐరన్ శాతం తగ్గకూడదు. దీనివల్ల రక్తహీనత ఏర్పడి తీవ్రరూపం దాల్చవచ్చు. ఐరన్ లోపం వల్ల ఎర్ర రక్తకణాల్లో ఆక్సిజన్ సరఫరా సామర్థ్యం తగ్గుతుంది.

ఇలాంటివి ఇబ్బందులు తలెత్తకుండా, రక్తంలో ఐరన్ శాతాన్ని పెంచే ఆయుర్వేద మార్గాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నల్ల నువ్వులు

ఇందులో ఐరన్ తో పాటు కాపర్, జింక్, సెలేనియం, విటమిన్ బీ6 ఉంటాయి.

నువ్వులని పెనం మీద వేయించి, దానిలో కొంచెం తేనె, నెయ్యి కలిపి ఒక ఉండలాగా తయారు చేసి, రోజూ ఉదయం పూట తినాలి.

ఖర్జూరం, ఎండు ద్రాక్ష

బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు రెండు నుండి మూడు ఖర్జూర పండ్లు, ఒక చెంచా ఎండు ద్రాక్ష తీసుకోవాలి.

బీట్ రూట్, క్యారెట్

బీట్ రూట్ ని ముక్కలుగా చేసి జ్యూస్ చేసుకుని రోజూ పొద్దున్న పూట తాగితే ఐరన్న్ లెవెల్స్ పెరుగుతాయి.

గోధుమ గడ్డి

ఇండులో బీటా కెరాటిన్, ఫోలిక్ ఆమ్లం, కాల్షియం, ఐరన్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటివల్ల కొత్త రక్తం పుట్టుకు వస్తుంది.

పొద్దున్న లేవగానే ఒక గ్లాసు సేవిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

మునగా చెట్టు అకులు

రోజూ ఉదయం పూట మునగ ఆకుల పౌడర్ ని తింటే రక్తంలో ఐరన్ శాతం పెరుగుతుంది. దీనిలో ఐరన్ తో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news