హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) మీద వాయి వేగంతో దూసుకు పోతున్నారా ? అయితే జర జాగ్రత్త. ఎందుకంటే ఇక మీద నిర్దేశిత లైన్ లోనే వేగంగా వెళ్ళాల్సి ఉంటుంది. అంతే కాక ఓఆర్ఆర్ మీద టాప్ స్పీడ్ 100గా నిర్ణయించారు. నిజానికి గతంలో ఇది 120KMPH గా ఉంటుంది. అలానే మొదటి రెండు వరుసల్ల్లో వెళ్ళే వాహనాలు 100, మరో రెండు వరుసలలో వెళ్ళే వాహనాలు 80 స్పీడ్ తో వెళ్ళాల్సి ఉంది.
ఒకవేళ అతిక్రమించి వేగంగా వెళితే స్పీడ్ గన్స్ తో ఫోటోలు తీసి జరిమానా విధించనున్నారు. ఇక రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ప్రతి రోజు సగటున 2,600 స్పీడ్ గన్స్ పేలుతున్నాయి. అంటే సగటున నిమిషానికి రెండు కేసులు నమోదు అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల కట్టడికి పోలీసు విభాగం ఎక్కు పెట్టిన ఈ గన్లు రోజూ కోట్ల రూపాయల దాకా సర్కారుకు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. అంతే కాక హైవేలపైకి ఎక్కాలంటే వాహనదారులను భయపెడుతున్నాయి. .