మ‌హిళ‌ల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కొత్త స్కీమ్

-

హైద‌రాబాద్: మ‌హిళ‌ల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కొత్త ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది. అదే జీహెచ్‌ఎంసీలో మహిళలకు వాహ‌నాలు అందించి ఉపాధిని క‌ల్పించే ప‌థ‌కం (మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ స్కీమ్). దీనిలో భాగంగా చేపలు, చేపల వంటకాల విక్రయానికి మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది.  రాష్ట్రంలో మ‌హిళ‌ల ఉపాధి క‌ల్ప‌న చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

ఈ ప‌థ‌కం కింద  జీహెచ్ఎంసీ పరిధిలో  ఉన్న 150 డివిజన్లకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 150 సంచార చేపల విక్రయ వాహనాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో వాహనం ఖరీదు రూ.10 లక్షలుగా ఉంది. అయితే, ఈ వాహ‌నాల‌ కొనుగోలుకు అయ్యే ఖ‌ర్చులో  ప్రభుత్వం 60 శాతం సబ్సిడీని లబ్దిదారుల‌కు  అందజేయనుంది. గ్రూపులుగా ముందుకు వచ్చే మహిళలకు వీటిని అందజేయనున్నారు.

కాగా, ఇప్ప‌టికే గ్రామాల్లో మత్స్యకారులకు టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలు సబ్సిడీ మీద ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో జీహెచ్ఎంపీ ప‌రిధిలోని మ‌హిళ‌ల కోసం ఈ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చామ‌ని తెలిపింది. అలాగే,  తాజా చేపలను, చేపల వంటకాలను నేరుగా వినియోగదారుడి వద్దకు చేర్చడంతో పాటు, వాటి విక్రయం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంభన పొందేలా చేయడమే ఈ మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ స్కీమ్  ముఖ్య ఉద్దేశమని మత్స్యఅభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news