జిమ్‌ అవసరం లేకుండా.. ఇంట్లోనే ఇలా వర్కౌట్స్‌ చేసుకోండి!

-

మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి ఎక్సర్‌సైజ్‌ చాలా ముఖ్యం. మానసికంగా ఉల్లాసంగా ఉండాలన్నా వర్కౌట్స్‌ తప్పనిసరి. సాధారణంగా మనం ఎక్సర్‌సైజ్‌లు చేయడానికి జిమ్‌కు వెళ్తాం. అయితే కొన్ని రకాల వర్కౌట్స్‌ జిమ్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు. పైగా కరోనా నేపథ్యంలో రద్దీ ప్రదేశాలకు వెళ్లడానికి జంకుతున్నారు జనం. నిత్యం జిమ్‌లలో వ్యాయామం చేయాలనుకునే వారికి కరోనా పెద్ద అడ్డంకిగా మారింది. కానీ తీవ్రత ఎక్కువగా ఉండే హై ఇంటెన్సిటీ వర్కవుట్లను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.

ఇంట్లోనే ఉంటూ మెట్లను ఆధారంగా చేసుకొని కొన్ని వర్కవుట్లు చేసుకోవచ్చు. ఈ కార్డియో, స్ట్రెన్త్‌
బేస్డ్‌ ఎక్ససైజ్‌లు మంచి రిసాల్ట్స్‌ను ఇస్తాయి. కొన్ని రకాల వ్యాయామాలకు ఎలాంటి జిమ్‌ పరికరాలు అవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ మెట్లను ఆధారంగా చేసుకొని కొన్ని వర్కవుట్లు చేసుకోవచ్చు.

  • ఎంతో సులభమైన వ్యాయామం స్టెయిర్‌ హోప్‌. రెండు కాళ్లనూ భుజాలకు సమాంతర దూరంలో పెట్టి కింది మెట్టు మీద నిల్చోవాలి. మోకాళ్లను కొద్దిగా వంచుతూ, నడుం బలంతో రెండు కాళ్లతో ఒకేసారి పై మెట్టు మీదకు గెంతాలి. ఇలా రెండు పాదాలతో చివరి స్టెప్‌ వరకు వెళ్లాలి. పై మెట్టు మీదకు దూకినపుడు మోకాళ్లను వంచాలి. మెట్ల పైకి గెంతుతున్నప్పుడు బాడీని బ్యాలెన్స్‌ చేయడానికి చేతులను ఉపయోగించాలి. దీన్ని రోజుకు 20 సార్లు చేయాలి.
  • ముందు కింది మెట్టు దగ్గర నిల్చొని పాదాలను భుజాలకు సమాన దూరంలో పెట్టాలి. మీ ఎడమ కాలును పైకి ఎత్తి, కాస్త వెనక్కు కదిలించి, ఒక పైమెట్టును వదిలేసి రెండో మెట్టుపైన ఎడమ కాలు పెట్టి పైకి చేరుకోవాలి. శ్వాస ఎక్కువగా తీసుకుంటూ.. రెండు మోకాళ్లను వంచుతూ పైకి వెళ్లాలి. ఈ సమయంలో మీ కుడి మోకాలు నేలకు 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. వెన్నును వంచకూడదు. మరోసారి కుడికాలుతో ఈ విధంగానే చేయాలి. ప్రతిరోజు ఈ వర్కవుట్‌ను 10 సార్లు చేయాలి.
  • మెట్టు దగ్గర స్టెప్స్‌ డైరెక్షన్ లో నిల్చోవాలి. మీ ఎడమ పాదాన్ని ఎడమవైపు వీలైనంత దూరం జరిపి అదే డైరెక్షన్ లో పైమెట్టు మీదకు గెంతాలి. ఆ తరువాత కుడి కాలును సాధ్యమైనంత వరకు కుడివైపు దూరంగా జరిపి అదే యాంగిల్‌లో స్టెప్స్‌ పైకి గెంతాలి. మీ సామర్థ్యాన్ని బట్టి ఒక మెట్టు వదిలి మరో మెట్టు మీదకు గెంతవచ్చు. పై వరకు వెళ్లిన తరువాత కిందకు నడుచుకుంటూ వచ్చి మళ్లీ మరోసారి వ్యాయామం చేస్తూ పైకి వెళ్లాలి.
  • ట్రైసెప్‌ స్టెయిర్‌ డిప్‌.. దీనికోసం ముందు కింది నుంచి రెండో లేదా మూడో మెట్టుమీద కూర్చోవాలి. కూర్చున్న మెట్టుపై రెండు అరచేతులూ పెట్టి, చేతులపై బరువు వేసి నడుము పైకి ఎత్తాలి. మెట్ల నుంచి శరీరం మొత్తం పైకి వచ్చేలా చూసుకోవాలి. పైకి లేచేటప్పుడు చేతులు నిటారుగా ఉండాలి. ఈ వ్యాయామాన్ని కనీసం 10 సార్లు చేయాలి

Read more RELATED
Recommended to you

Latest news