ఆ క్రెడిట్ త‌న‌దే అంటున్న కిష‌న్‌రెడ్డి.. ఎందుకింత ఆరాటం?

-

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ప‌నిచేయడం గొప్ప‌కాదు.. ఆ ప‌నిని చేసిన‌ట్టు త‌మ ఖాతాలో క్రెడిట్ వేసుకోవ‌డ‌మే గొప్ప‌. ఇదే పంతాలో ఇప్పుడు కిష‌న్‌రెడ్డి న‌డుస్తున్నారు. రీసెంట్ గా తెలంగాణ హైకోర్టులో జ‌డ్జిట సంఖ్య‌ను పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌త్యేక చొర‌వ‌ను తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌నికాస్తా త‌న‌దే అంటూ కిష‌న్‌రెడ్డి చెబుతున్నారు.

తెలంగాణ హైకోర్టు జ‌డ్జీల సంఖ్యను పెంచాల‌నే ప్రతిపాద‌న ఎప్ప‌టి నుంచో పెండింగ్‌లోనే ఉంది. అయితే రీసెంట్‌గా సుప్రీం చీఫ్ జ‌స్టిస్‌గా బాధ్యతలు తీసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ ఈ పెండింగ్ ప‌నిని వాస్త‌వ రూపం దాల్చేలా చూశారు. కాక‌పోతే ఈ వ్య‌వ‌హారం వెన‌క త‌న హ‌స్తం ఉంద‌ని కిషన్ రెడ్డి మాటలు చెప్ప‌డం ఆసక్తికరంగా మారాయి.

జ‌డ్జీల సంఖ్య పెంపు ఫైలుమీద త‌న స‌మ్మ‌తితోనే కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంత‌కం చేశార‌ని చెప్పారు. న్యాయ‌మూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచే ఫైలు మీద సంతకం చేసే ముందు కేంద్రమంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ త‌న‌ను పిలిపించి మ‌రీ మాట్లాడిన త‌ర్వాతే పెట్టార‌న్నారు. అయితే కిష‌న్‌రెడ్డి మాట‌లు ఆ క్రెడిట్‌ను త‌న ఖాథాలో వేసుకోవ‌డానికే అన్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news