పొద్దున్న లేవగానే చాలా తొందరగా బ్రేక్ ఫాస్ తయారు చేసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరూ బ్రెడ్ ని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. ముందుగానే రెడీగా ఉంటుంది కాబట్టి త్వరగా తినవచ్చని బ్రెడ్ వైపుకే మొగ్గుతారు. మార్కెట్లో చాలా రకాల బ్రెడ్లు అందుబాటులో ఉంటాయి. వివిధ పదార్థాలతో తయారు చేసిన బ్రెడ్లు మనకు లభిస్తాయి. అందులో ఎక్కువ మంది ఇంటికి తీసుకువచ్చేది వైట్ బ్రెడ్. ఎక్కువ మంది ఇళ్ళల్లో ఇదే ఎక్కువగా కనిపిస్తుంది.
వైట్ బ్రెడ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదనే విషయం మీకు తెలుసా?
అవును, వైట్ బ్రెడ్ ఎందుకు తినకూడదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
వైట్ బ్రెడ్ ఎలా తయారు చేస్తారంటే,
గోధుమ పిండిలో రకరకాల రసాయనాలైన బెంజోల్ పెరాకైడ్, క్లోరిన్ డయాక్సైడ్, పొటాషియం బ్రోమేట్ వంటివి రిఫైన్ చేసిన పిండికి కలుపుతారు. వీటివల్ల బ్రెడ్ వైట్ కలర్ లోకి మారుతుంది. ఈ రసాయనాలను శరీరానికి హాని కలగజేయని నిష్పత్తిలో కలుపుతారు.
వైట్ బ్రెడ్ లో పోషక విలువలు తక్కువ. అదీగాక అత్యధిక గ్లిసమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. గ్లూకోజ్ ని తొందరగా పెంచి ఇబ్బంది కలిగిస్తుంది. డయాబెటిస్ తో బాధపడేవారు వైట్ బ్రెడ్ ముట్టుకోవద్దు.
బరువు పెంచుతుంది
బరువు తగ్గాలనుకునే వారు వారి లిస్టులో నుండి వైట్ బ్రెడ్ తీసేయాలి. రిఫైన్ చేసిన బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనివల్ల చాలా త్వరగా బరువు పెరుగుతారు.
మూడ్ మార్పులు
అమెరికన్ జర్నల్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం వైట్ బ్రెడ్ ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూడ్ మారుతుంటుంది. మూడ్ స్వింగ్స్ కి ఇది కారణంగా నిలుస్తుంది. 50కంటే ఎక్కువ వయసు కలిగిన మహిళల్లో ఒత్తిడికి ఇది కారణం అవుతుంది.